T20 World Cup 2021 : త‌డ‌బ‌డిన భార‌త్‌.. పాకిస్థాన్ ల‌క్ష్యం 152..

October 24, 2021 9:28 PM

T20 World Cup 2021 : దుబాయ్‌లో భార‌త్, పాకిస్థాన్‌ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 16వ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌ను కోల్పోయి 151 ప‌రుగులు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భార‌త్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో భార‌త్ టాప్ ఆర్డ‌ర్ త‌డ‌బ‌డింది. అయితే కెప్టెన్ కోహ్లి స‌మ‌య‌స్ఫూర్తితో ఆడుతూ పంత్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.

T20 World Cup 2021 india made 151 runs against pakisthan for the loss of 7 wickets

ఈ క్ర‌మంలో విరాట్ కోహ్లి 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 57 ప‌రుగులు చేయ‌గా.. 30 బంతులు ఆడిన పంత్ 2 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 39 ప‌రుగులు చేశాడు. దీంతో భార‌త్ గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరును చేయ‌గ‌లింది.

పాక్ బౌల‌ర్ల‌లో షాహీన్ షా ఆఫ్రిది 3 వికెట్ల‌ను తీసి భార‌త టాప్ ఆర్డ‌ర్‌ను కుప్ప‌కూల్చాడు. హ‌స‌న్ అలీకి 2 వికెట్లు ద‌క్కాయి. షాదాబ్ ఖాన్‌, హ‌రిస్ రౌఫ్‌లు చెరొక వికెట్ తీశారు. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించాలంటే 152 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment