Silk Smitha : సిల్క్ స్మితను మోసం చేసిన హీరో ఎవరో తెలుసా.. అన్ని కోట్ల ఆస్తులను తన పేర రాయించుకున్నాడా..?

September 13, 2022 7:33 AM

Silk Smitha : సిల్క్ స్మిత.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలనం.. గ్లామరస్ పాత్రలు చేస్తూ అప్పటి కుర్రకారుల హృదయంలో స్థానం సంపాదించుకుంది. తన కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కే మత్తెక్కించిన గ్లామరస్ యాక్టర్ సిల్క్ స్మిత. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలై సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సినీ కెరీర్ పీక్స్ లో ఉండగా ఓ హీరోతో ప్రేమ విఫలమవడం, కొన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవడం వంటివి సిల్క్ స్మితని డిప్రెషన్‌లోకి నెట్టేశాయి. అప్పట్లో హీరోయిన్ల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేంత క్రేజ్ ఆమెకు ఉండేది. అలా స్టార్ హీరోల‌తో స‌మాన‌మైన క్రేజ్ తెచ్చుకున్న సిల్క్ స్మిత ఎన్నో కోట్లు సంపాదించింది.

సిల్క్ స్మిత త‌న సంపాద‌న పెంచుకోవాల‌న్న ఆశ‌తో నిర్మాత‌గా కూడా మారింది. అయితే ఆమె నిర్మాత‌గా చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆర్థికంగా న‌ష్ట‌పోయింది. ఇలా ఆమె సంపాదించిన ఆస్తులు క్ర‌మ‌క్ర‌మంగా త‌రుగుతూ వచ్చాయి. చివ‌ర్లో ఆమె ఆస్తులు క‌రిగిపోవ‌డంతో అప్పులు కూడా చేసింది. దీంతో ఆమె అనేక వ్య‌స‌నాల‌కు బానిసయింది. సిల్క్ స్మిత‌ కష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆమెతో స‌న్నిహితంగా ఉన్న స్టార్ హీరోలు ఎవరురూ సాయం చేయ‌లేదు. చివ‌ర‌కు ఆమె ఎంతో ఇష్టంగా ప్రేమించిన ఓ స్టార్ హీరో సైతం ఆమె క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు దూరం పెట్టేశాడు. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఆమె ఎంతో న‌మ్మిన ఓ న‌టుడు చివ‌ర్లో ఆమెను దారుణంగా మోసం చేశాడ‌ట‌.

Silk Smitha cheated by a star hero got her assets
Silk Smitha

త‌న ఆత్మ‌హ‌త్య లేఖ‌లో కూడా త‌న‌ను కొంద‌రు మోసం చేశార‌ని రాసి మ‌రీ తీవ్ర‌మైన ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇక ఆమెను మోసం చేసింది ఎవ‌రో కాదు.. అప్ప‌ట్లో ఓ ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఉండేవాడు. స్మిత కెరీర్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడు మాయ‌మాట‌లు చెప్పి ఆమెకు ద‌గ్గ‌ర‌య్యాడు. ఆ త‌ర్వాత ఆమె అత‌డిని న‌మ్మి త‌న ఆస్తుల వివ‌రాలన్నీ చెప్పేసింది. ఆమెను అలా గుప్పెట్లోకి తెచ్చుకుని.. ఆమె మ‌ద్యం మ‌త్తులో ఉండగా ఆమె ఆస్తుల‌ను త‌న పేరు మీద రాయించుకున్నాడు. తాను మోస‌పోయాన‌న్న విష‌యం స్మిత‌కు చివ‌ర్లో కానీ అర్థం కాలేదు. చివ‌ర‌కు అదే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపిత‌మైంది. సిల్క్ స్మిత జీవితాన్ని డర్టీ పిక్చర్ గా డైరెక్టర్ మిలన్ లుథ్రియా తెరకెక్కించారు. ఇందులో విద్యాబాలన్ సిల్క్ స్మిత క్యారెక్టర్ లో నటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment