ప్రస్తుతం బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ తనయుడి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు మెరుపుదాడి చేసి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌తోపాటు ఆర్యన్ ఖాన్, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 7 వరకు కస్టడీలో ఉండనున్నాడు. అయితే ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌పై చర్చలు నడుస్తున్న సమయంలో పాత సంఘటనని తెరపైకి తేగా ఇప్పుడు అది హాట్ టాపిక్‌గా మారింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కి యజమానిగా ఉన్న షారూఖ్ ఖాన్ పార్టీ ఏర్పాటు చేయగా, దానికి హాజరైన షెర్లిన్ అక్కడ ఏం జరిగిందో ఓ వీడియో ద్వారా తెలియజేసింది. పార్టీలో డ్యాన్స్ చేసి అలసిపోయి వాష్‌రూమ్‌కు వెళ్లాను. డోర్ ఓపెన్ చేయగానే అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యాను.
బాలీవుడ్ స్టార్స్ భార్యలు అందరూ అద్దాల ముందు నిలుచొని తెల్లని పౌడర్ పీలుస్తున్నారు. వారు తీసుకునేది డ్రగ్స్ అని అర్ధం కావడంతో వెంటనే షారూఖ్, అతని స్నేహితులకి గుడ్ బై చెప్పి వెళ్లాను. బాలీవుడ్‌లో జరిగే పార్టీల గురించి ఆ రోజే పూర్తిగా తెలిసింది’ అని షెర్లిన్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ అమ్మడు చేసిన కామెంట్స్ అందరిలో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. కాగా, క్రూయిజ్ షిప్‌పై జరిపిన దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 22 మాత్రలు ఎండీఎంఏ, 5 గ్రాముల ఎండీ లభించాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది.
బట్టలు, లోదుస్తులు, పర్సులలో డ్రగ్స్ దాచినట్టుగా సమాచారం. ఆర్యన్ ఖాన్‌ను ప్రశ్నించడానికి అక్టోబర్ 7 వరకు కస్టడీలో ఉండాలని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో లింకులు ఉన్నాయని ఎన్సీబీ అధికారులు ఆరోపిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…