Viral : సాధారణంగా ఎంతో ధనవంతులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న ఈవెంట్ ఉన్నా కానీ పెద్ద మొత్తంలో, ఎంతో ఖరీదైన వస్తువులను కానుకగా ఇవ్వడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఇండియాకు చెందిన ఓ యువ వ్యాపారవేత్త దుబాయ్ లో ప్రస్తుతం అత్యున్నతమైన కంపెనీలో సీఈఓ గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ యువ వ్యాపారవేత్త తన భార్య పుట్టిన రోజు ఏకంగా రూ.3.24 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చాడు. తన భార్య, బిడ్డ, కారుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయగా.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేరళకు చెందిన అమ్జాద్ సితార దుబాయ్ లో బీబీసీ కంపెనీ వ్యవస్థాపకుడు. సీఈవోగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం యూఏఈలోనే టాప్ ప్లేస్ లో ఈ కంపెనీ ఉంది. ఆయన తన భార్య మార్జన కి ఎంతో విలువైన కారును బహుమతిగా ఇచ్చాడు. తన భార్య అక్టోబర్ 2వ తేదీన పుట్టిన రోజు జరుపుకోవడంతో తనకెంతో ఇష్టమైన ఎర్రటి రోల్స్ రాయిస్ రెయిత్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు.
ఈ సందర్భంగా అమ్జాద్ సితార ప్లాన్ ప్రకారం కారును థర్మోకోల్ షీట్ తో కప్పి ఉంచి దానిపై “హ్యాపీ బర్త్‌డే మై లవ్. నా ప్రతిక్షణాన్ని ఎంతో అద్భుతంగా మార్చినందుకు థ్యాంక్స్. ప్రేమతో అమ్జాద్ సితార” అని రాశాడు. ఇక రిబ్బన్ కట్ చేయగానే ఎర్రటి రోల్స్ రాయిస్ కారుని చూడగానే తన భార్య ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అయితే నెల రోజుల కిందట ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే తన కూతురు ఐరాతో కలసి కారు ముందు నిలబడి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…