Viral : వాహ్‌.. భార్య పుట్టిన రోజుకు రూ.3.24 కోట్ల కారును బహుమతిగా ఇచ్చిన భర్త..!

October 7, 2021 8:41 AM

Viral : సాధారణంగా ఎంతో ధనవంతులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న ఈవెంట్ ఉన్నా కానీ పెద్ద మొత్తంలో, ఎంతో ఖరీదైన వస్తువులను కానుకగా ఇవ్వడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఇండియాకు చెందిన ఓ యువ వ్యాపారవేత్త దుబాయ్ లో ప్రస్తుతం అత్యున్నతమైన కంపెనీలో సీఈఓ గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ యువ వ్యాపారవేత్త తన భార్య పుట్టిన రోజు ఏకంగా రూ.3.24 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చాడు. తన భార్య, బిడ్డ, కారుతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేయగా.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral man given rs 3 crore car as birth day gift to his wife

కేరళకు చెందిన అమ్జాద్ సితార దుబాయ్ లో బీబీసీ కంపెనీ వ్యవస్థాపకుడు. సీఈవోగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం యూఏఈలోనే టాప్ ప్లేస్ లో ఈ కంపెనీ ఉంది. ఆయన తన భార్య మార్జన కి ఎంతో విలువైన కారును బహుమతిగా ఇచ్చాడు. తన భార్య అక్టోబర్ 2వ తేదీన పుట్టిన రోజు జరుపుకోవడంతో తనకెంతో ఇష్టమైన ఎర్రటి రోల్స్ రాయిస్ రెయిత్‌ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు.

ఈ సందర్భంగా అమ్జాద్ సితార ప్లాన్ ప్రకారం కారును థర్మోకోల్ షీట్ తో కప్పి ఉంచి దానిపై  “హ్యాపీ బర్త్‌డే మై లవ్. నా ప్రతిక్షణాన్ని ఎంతో అద్భుతంగా మార్చినందుకు థ్యాంక్స్. ప్రేమతో అమ్జాద్ సితార” అని రాశాడు. ఇక రిబ్బన్ కట్ చేయగానే ఎర్రటి రోల్స్ రాయిస్ కారుని చూడగానే తన భార్య ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అయితే నెల రోజుల కిందట ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే తన కూతురు ఐరాతో కలసి కారు ముందు నిలబడి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment