హీరోల భార్య‌లు డ్ర‌గ్స్ తీసుకుంటారు.. సంచ‌ల‌న కామెంట్స్ చేసిన న‌టి..

October 7, 2021 9:37 AM

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ త‌న‌యుడి వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవ‌ల ముంబై తీరంలోని ఓ క్రూయిజ్‌ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు మెరుపుదాడి చేసి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌తోపాటు ఆర్యన్‌ ఖాన్‌, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

sherlyn chopra sensational comments on actors and actress

ఆర్య‌న్ ఖాన్ అక్టోబ‌ర్ 7 వ‌ర‌కు క‌స్ట‌డీలో ఉండ‌నున్నాడు. అయితే ప్ర‌స్తుతం ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్‌పై చ‌ర్చ‌లు న‌డుస్తున్న స‌మ‌యంలో పాత సంఘ‌ట‌న‌ని తెర‌పైకి తేగా ఇప్పుడు అది హాట్ టాపిక్‌గా మారింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కి య‌జ‌మానిగా ఉన్న షారూఖ్ ఖాన్ పార్టీ ఏర్పాటు చేయ‌గా, దానికి హాజ‌రైన షెర్లిన్ అక్క‌డ ఏం జ‌రిగిందో ఓ వీడియో ద్వారా తెలియ‌జేసింది. పార్టీలో డ్యాన్స్ చేసి అలసిపోయి వాష్‌రూమ్‌కు వెళ్లాను. డోర్ ఓపెన్ చేయగానే అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యాను.

బాలీవుడ్ స్టార్స్ భార్య‌లు అంద‌రూ అద్దాల ముందు నిలుచొని తెల్ల‌ని పౌడ‌ర్ పీలుస్తున్నారు. వారు తీసుకునేది డ్ర‌గ్స్ అని అర్ధం కావ‌డంతో వెంట‌నే షారూఖ్‌, అత‌ని స్నేహితుల‌కి గుడ్ బై చెప్పి వెళ్లాను. బాలీవుడ్‌లో జరిగే పార్టీల గురించి ఆ రోజే పూర్తిగా తెలిసింది’ అని షెర్లిన్ స్ప‌ష్టం చేసింది. ఇప్పుడు ఈ అమ్మ‌డు చేసిన కామెంట్స్ అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగిస్తున్నాయి. కాగా, క్రూయిజ్ షిప్‌పై జ‌రిపిన దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 22 మాత్రలు ఎండీఎంఏ, 5 గ్రాముల ఎండీ లభించాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది.

బట్టలు, లోదుస్తులు, పర్సులలో డ్రగ్స్ దాచినట్టుగా సమాచారం. ఆర్యన్ ఖాన్‌ను ప్రశ్నించడానికి అక్టోబర్ 7 వరకు కస్టడీలో ఉండాలని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో లింకులు ఉన్నాయని ఎన్సీబీ అధికారులు ఆరోపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now