శనివారం, జూన్ 13, 2026
వార్తలు

Sharwanand : ఓటీటీలో విడుదలకానున్న శర్వానంద్ తదుపరి చిత్రం..!

Sharwanand : కరోనా  వల్ల థియేటర్లు మూత పడటంతో ఓటీటీలకు ఎంతో మంచి ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోల చిత్రాలు కూడా ఓటీటీలో విడుదలవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా శర్వానంద్,…

Sharwanand : ఓటీటీలో విడుదలకానున్న శర్వానంద్ తదుపరి చిత్రం..!

Sharwanand : కరోనా  వల్ల థియేటర్లు మూత పడటంతో ఓటీటీలకు ఎంతో మంచి ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోల చిత్రాలు కూడా ఓటీటీలో విడుదలవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా శర్వానంద్, సిద్ధార్థ మల్టీస్టారర్ చిత్రంగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రం థియేటర్లలో విడుదల అయ్యి ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.

Sharwanand next movie will be released on ott

ఈ క్రమంలోనే శర్వానంద్ నటిస్తున్న తదుపరి చిత్రాన్ని థియేటర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. శర్వానంద్ వరుసగా నాలుగైదు ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొనగా ప్రస్తుతం శర్వానంద్ మంచి హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే శర్వానంద్ తమిళ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మించిన “ఒకే ఒక జీవితం” అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. ఇక శర్వానంద్ నటించిన ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

ఇక ఇందులో రీతూవర్మ హీరోయిన్ పాత్రలో నటించగా అక్కినేని అమల కీలక పాత్రలో నటించారు. మరి ఈ చిత్రం ద్వారా అయినా శర్వానంద్ విజయాన్ని అందుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయాల గురించి త్వరలోనే వివరాలను వెల్లడించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి