Maha Samudram : నెట్ ఫ్లిక్స్ లో మహా సముద్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

September 29, 2021 6:50 PM

Maha Samudram : ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ – సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం మహాసముద్రం. లవ్ అండ్ యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా అక్టోబర్ 14 వ తేదీన థియేటర్‌లలో విడుదల కానుండడంతో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.

Maha Samudram : నెట్ ఫ్లిక్స్ లో మహా సముద్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Maha Samudram

తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో యూట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ప్లిక్స్ సొంతం చేసుకుందని, ఏకంగా 11 కోట్ల రూపాయలతో డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా థియేటర్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాతనే డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే అక్టోబర్ 14న విడుదల కానున్న ఈ సినిమాకు చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్థ ఈ చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now