Maha Samudram First Review : మ‌హాస‌ముద్రం మూవీ.. ఫ‌స్ట్ రివ్యూ..!

October 13, 2021 9:36 AM

Maha Samudram First Review : ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా చిత్రం.. మ‌హాస‌ముద్రం. ఇందులో శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ న‌టించారు. అదితి రావు హైద‌రి ఇందులో మ‌హా పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. అను ఎమ్మాన్యుయెల్ లాయ‌ర్‌గా న‌టించింది. అయితే ఈ మూవీ గురించి మాట్లాడిన అజ‌య్ భూప‌తి రివ్యూను షేర్ చేసుకున్నారు.

Maha Samudram First Review is out know what director said

మ‌హా స‌ముద్రం మూవీ ఇద్ద‌రు స్నేహితుల క‌థ‌. వారి ప్రేమ జీవితాల‌కు చెందిన క‌థ‌ను ఇందులో చూపించాం. అలాగే వైజాగ్ తీర ప్రాంతంలో నివసించే వారితోపాటు వారి చుట్టూ ఉండే వ్య‌క్తుల‌కు సంబంధించిన క‌థే.. మ‌హాస‌ముద్రం. ఇందులో ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య ఉన్న స్నేహం గురించి గొప్ప‌గా చూపించాం.. అని అజ‌య్ భూప‌తి తెలిపారు.

ఇక ఈ మూవీ క‌థను ప‌ట్టుకుని ఎంతో మంది హీరోల దగ్గ‌రికి వెళ్లాన‌ని.. కానీ మ‌ల్టీ స్టార‌ర్ కావ‌డంతో చేసేందుకు వెనుకాడార‌ని అన్నారు. అయితే శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌లు చివ‌ర‌కు ఈ మూవీని చేస్తామ‌ని ఒప్పుకున్నార‌ని.. దీంతో చిత్రం తెర‌కెక్కింద‌ని తెలిపారు. కాగా మ‌హా స‌ముద్రం సినిమాను అనిల్ సుంక‌ర నిర్మించగా.. ఈ సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్రేక్ష‌కులు శ‌ర్వానంద్‌, సిద్ధార్థ‌ల పాత్ర‌ల‌ను జీవితాంతం గుర్తుంచుకుంటార‌ని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now