Samantha : గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత పేరు మార్మోగిపోతోంది. విడాకుల ప్రకటన అనంతరం సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గురించి వస్తున్న వార్తలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనలో ఉన్న భావాలను వీడియోల రూపంలో, కొటేషన్ల రూపంలో పోస్ట్ చేస్తూ సమాజాన్ని ప్రశ్నించడమే కాకుండా తన మనసులో ఉన్న బాధను కూడా బయట పెడుతోంది.
విడాకుల ప్రకటన తర్వాత ఎవరి దారి వారిదే అని చెప్పిన ఈ జంట ప్రస్తుతం వారి కెరీర్ విషయంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సమంత విడాకుల బాధ నుంచి బయట పడటం కోసం సినిమా అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా తన శరీరంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎక్కువగా జిమ్ లో గడుపుతున్న వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తోంది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమంత జిమ్ లో తన స్నేహితులతో కలిసి కుస్తీ పడుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోని షేర్ చేయడమే కాకుండా.. ఫిట్ గా ఉన్న వారితో పోటీ వద్దు. అలాంటి వారితో పోటీ పడటం వల్ల ఎంతో బాధను భరించాల్సి వస్తుంది.. అంటూ క్యాప్షన్ జోడించింది. అయితే సమంత ఈ కొటేషన్ ను ఎవరిని ఉద్దేశించి పెట్టింది ? ఎవరి గురించి ఇలా మాట్లాడింది ? ఈ మాటల వెనుక ఏదైనా అర్థం దాగి ఉందా ? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి సమంత ఏముందో.. మనకు తెలియదు కదా. ఏది ఏమైనా.. ఆమె విడాకుల తరువాత తీవ్రంగా మనస్థాపం చెందినట్లు మాత్రం తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…