Trivikram Srinivas : అభిమానం ముసుగులో కొందరు స్టార్ హీరోల అభిమానులు వికృత చేష్టలు చేస్తున్నారు. ఫోన్‌లు చేసి వార్నింగ్‌లు ఇవ్వడం, ఎదుటివారిపై దాడి చేయడం వంటివి కూడా చేస్తున్నారు. 2010లో మహేష్ బాబు అభిమాని త్రివిక్రమ్‌కి ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. దీనిని త్రివిక్రమ్ కామెడీగా తీసుకున్నట్టు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్నారు త్రివిక్రమ్.
2010వ సంవత్సరం లో మహేష్ తో కలిసి ఖలేజా సినిమాను నిర్మించాడు త్రివిక్రమ్. అనుష్క, సునీల్, ఆలీ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాని మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల చేయాలని లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని ఒక బెదిరింపు కాల్ వచ్చినట్లు ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. హీరోల ఫ్యాన్స్ నుండి బెదిరింపు కాల్స్ అప్పటి నుండే వచ్చాయని, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకే తాను ముందుగానే ఈ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
స్టార్ హీరోలు త్రివిక్రమ్‌తో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఆయన పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. త్వరలో మహేష్ బాబుతో కలిసి ఓ చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం మహేష్ బాబు రేంజ్‌ని మరింత పెంచేలా ఉంటుందని సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…