Kiara Advani : బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎప్పట్నుండో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. వీరిద్దరూ ఓ ప్రైవేట్ పార్టీలో కలుసుకుని.. షేర్ షా అనే సినిమాలో కలిసి యాక్ట్ చేయడంతో వీరిద్దరి రిలేషన్ మరింత ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో సిద్థార్థ్ ఇంటికి కియారా అర్థరాత్రుళ్ళు వెళ్తున్నట్లు కెమెరాలలో కనిపించింది. విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ ఇప్పటివరకు కలసి కనిపించలేదు. కానీ ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఓ ప్రముఖ యాడ్ లో కనిపించారు.
రీసెంట్ గా ఉద్దమ్ సింగ్ ప్రీమియర్ షోకి కూడా విక్కీతో కలిసి కత్రీనా కనిపించారు. వీరికి ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయిందని బాలీవుడ్ సమాచారం. నెక్ట్స్ టైగర్ ష్రాఫ్ లవ్ స్టోరీ గురించి బాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దిశా పఠాని, టైగర్ ఫ్యామిలీతో కలిసి టూర్స్ కి కూడా వెళ్తున్నట్లు సమాచారం. అలాగే రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ లు కూడా పెళ్ళి చేసుకోనున్నట్లు గత మూడేళ్ళుగా ప్రచారం సాగుతోంది. వీరి పెళ్ళి డేట్ ఫిక్సయ్యిందని అతి త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కుతారని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ ఏడాది బర్త్ డే కోసం రణ్ బీర్, ఆలియా జోధ్ పూర్ వెళ్తే.. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం లొకేషన్స్ చూస్తున్నారనే వార్తలొచ్చాయి.
మరి 39 ఏళ్ళు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న రణ్ బీర్ ఈ ఏడాదైనా పెళ్ళి చేసుకుంటారా లేదా అనేది తెలియాలి. విశ్వసుందరి సుస్మితా సేన్ ఏజ్ అయితే హాఫ్ సెంచరీకి దగ్గరవుతోంది. ఈ ఏజ్ లో తన కన్నా 15 ఏళ్ళు చిన్నవాడైన రోహమాన్ షాల్ తో ప్రస్తుతం లవ్ లో ఉంది. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. మూడేళ్ళ నుండి వీరి లవ్ స్టోరీపై రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ.. పెళ్ళి గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…