Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలైంది అంటే బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురుస్తూ ఉంటుంది. ఇటీవల రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ మధ్యలో కొన్నాళ్లు సినిమాలు చేయడం మానేశారు. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భీమ్లానాయక్, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమాలు పూర్తయిన తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాతోపాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది ఉంది. మరికొందరు దర్శకులు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలోపేతం చేసేందుకు గాను సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారట.
తన నివాసాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చాలని అనుకుంటున్నారట. అంటే ఎక్కువ సమయం అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలనేది పవన్ నిర్ణయం. అయితే సినిమా షూటింగ్స్ ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతూ ఉంటాయి. విజయవాడలో ఉండనున్న పవన్ ప్రతి సారిహైదరాబాద్‌కి రావడం కష్టం కాబట్టి, కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. గతంలో స్పైస్ జెట్‌లోఅక్కడి నుండి ఇక్కడికి తిరిగిన పవన్ ఇప్పుడు మాత్రం అలా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. నిర్మాతలకు మరింత ఆర్థిక భారాన్ని పెంచే ఆలోచన లేని పవన్ కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరం కానున్నారట.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…