గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha : అలాంటి వారితో అస్సలు పెట్టుకోకూడదు.. పెట్టుకుంటే ఆ బాధ ఎంతో నొప్పిగా ఉంటుంది.. సమంత ఎమోషనల్ పోస్ట్..!

Samantha : గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత పేరు మార్మోగిపోతోంది. విడాకుల ప్రకటన అనంతరం సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గురించి వస్తున్న వార్తలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ…

Samantha : అలాంటి వారితో అస్సలు పెట్టుకోకూడదు.. పెట్టుకుంటే ఆ బాధ ఎంతో నొప్పిగా ఉంటుంది.. సమంత ఎమోషనల్ పోస్ట్..!

Samantha : గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత పేరు మార్మోగిపోతోంది. విడాకుల ప్రకటన అనంతరం సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గురించి వస్తున్న వార్తలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనలో ఉన్న భావాలను వీడియోల రూపంలో, కొటేషన్ల రూపంలో పోస్ట్ చేస్తూ సమాజాన్ని ప్రశ్నించడమే కాకుండా తన మనసులో ఉన్న బాధను కూడా బయట పెడుతోంది.

Samantha told that do not mess up with persons like them shared post

విడాకుల ప్రకటన తర్వాత ఎవరి దారి వారిదే అని చెప్పిన ఈ జంట ప్రస్తుతం వారి కెరీర్ విషయంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సమంత విడాకుల బాధ నుంచి బయట పడటం కోసం సినిమా అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా తన శరీరంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎక్కువగా జిమ్ లో గడుపుతున్న వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తోంది.

https://www.instagram.com/p/CVM_HznAIDX/?utm_source=ig_web_copy_link

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సమంత జిమ్ లో తన స్నేహితులతో కలిసి కుస్తీ పడుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోని షేర్ చేయడమే కాకుండా.. ఫిట్ గా ఉన్న వారితో పోటీ వద్దు. అలాంటి వారితో పోటీ పడటం వల్ల ఎంతో బాధను భరించాల్సి వస్తుంది.. అంటూ క్యాప్షన్ జోడించింది. అయితే సమంత ఈ కొటేషన్ ను ఎవరిని ఉద్దేశించి పెట్టింది ? ఎవరి గురించి ఇలా మాట్లాడింది ? ఈ మాటల వెనుక ఏదైనా అర్థం దాగి ఉందా ? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి సమంత ఏముందో.. మనకు తెలియదు కదా. ఏది ఏమైనా.. ఆమె విడాకుల తరువాత తీవ్రంగా మనస్థాపం చెందినట్లు మాత్రం తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి