Samantha Rashmika Mandanna : రష్మికకు ఊహించని గిఫ్ట్ పంపిన సమంత.. సంతోషంలో శ్రీవల్లి..!

October 2, 2021 12:59 PM

Samantha Rashmika Mandanna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమంత ఎన్నో విభిన్న పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఆఫర్స్ కూడా దక్కించుకుంటోంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత చాలా మంది హీరోయిన్లతో మంచి ఫ్రెండ్‌షిప్‌ కొనసాగిస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సమంత ఓ స్టార్ హీరోయిన్ కు ఊహించని గిఫ్ట్ పంపి బిగ్ సర్‌ ప్రైజ్‌ ఇచ్చింది.

Samantha Rashmika Mandanna : రష్మికకు ఊహించని గిఫ్ట్ పంపిన సమంత.. సంతోషంలో శ్రీవల్లి..!

సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు ఓ మెరుపులా దూసుకుపోతున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న రష్మికకి సమంత ఇటీవల సాకీ బ్రాండ్ నుంచి గిఫ్ట్ హాంపర్ ని పంపింది. ఇలా సమంత గిఫ్ట్ పంపించడంతో రష్మిక ఎంతో ఆనందం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే సమంత పంపిన గిఫ్ట్ పై రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందిస్తూ.. కంగ్రాట్స్ బ్యూటిఫుల్ లేడీ. సాకీ కోసం నువ్వు చాలా చేస్తున్నావు. నువ్వు పంపిన గిఫ్ట్ నాకు నచ్చింది’ అని రష్మిక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే రష్మిక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో శ్రీవల్లి అనే ఒక గ్రామీణ యువతి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment