‘పెద్ది’ సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు.. రామ్ చరణ్ యాక్టింగ్‌పై క్రేజీ పోస్ట్!

రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టించిన పెద్ది సినిమా తాను చూశాన‌ని, సినిమా అద్భుతంగా ఉంద‌ని, త‌న ప్రియ‌మైన రామ్ చ‌ర‌ణ్ అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడ‌ని న‌టుడు అల్లు అర్జున్ కొనియాడారు.

జూన్ 9, 2026 2:10 సా.

రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టించిన పెద్ది సినిమా తాను చూశాన‌ని, సినిమా అద్భుతంగా ఉంద‌ని, త‌న ప్రియ‌మైన రామ్ చ‌ర‌ణ్ అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడ‌ని న‌టుడు అల్లు అర్జున్ కొనియాడారు. పెద్ది సినిమా జూన్ 4న థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతుండ‌గా, ఇప్ప‌టికే సినిమాను చూసిన అనేక మంది సెల‌బ్రిటీలు మూవీ బాగుంద‌ని కితాబిస్తున్నారు. ఇక విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం అనేక కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుండగా, మరోవైపు జాన్వీ కపూర్ పోషించిన అచియ్యమ్మ పాత్ర చిత్రీకరణపై కొందరు ప్రేక్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా స్పందిస్తూ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా తన బంధువు రామ్ చ‌ర‌ణ్ నటనను కొనియాడుతూ భావోద్వేగ పోస్టు పెట్టారు.

చ‌ర‌ణ్ ప‌ట్ల గ‌ర్వంగా ఉంది..

తాజాగా పెద్ది సినిమా చూశాన‌ని, త‌న‌ ప్రియమైన రామ్ చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడ‌ని అల్లు అర్జున్ త‌న పోస్టులో పేర్కొన్నారు. రఫ్ అండ్ రా పెర్ఫార్మెన్స్, అసాధారణమైన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, అందమైన డ్యాన్స్ మూవ్స్‌తో ప్రతి అంశంలోనూ అద్భుతంగా రాణించాడ‌ని, చ‌ర‌ణ్ ప‌ట్ల నిజంగా గర్వంగా ఉంద‌ని, ఆయనకు లభిస్తున్న ప్రశంసలన్నింటికీ పూర్తిగా అర్హుడ‌ని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అలాగే సీనియర్ నటుడు జ‌గ‌ప‌తి బాబు నటనను ప్రశంసించిన ఆయన, జగపతి బాబు నటన అద్భుతంగా ఉంద‌ని, మిగతా కళాకారులందరికీ అభినందనల‌ని, కథానాయిక జాన్వీ కపూర్ కు త‌న‌ ప్రేమాభిమానాల‌ని తెలిపారు. సాంకేతిక నిపుణులు, నిర్మాతలందరికీ ప్రత్యేక అభినందనలు అని అన్నారు.

బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీ..

చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సానాను కూడా ప్రశంసిస్తూ ప్రతి ఒక్కరిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు బుచ్చిబాబుకి త‌న‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నాన‌ని అల్లు అర్జున్ అన్నారు. ముఖ్యంగా చరణ్ ని గొప్ప స్థాయిలో ఆవిష్కరించినందుకు అభినందనల‌ని, పెద్ది టీమ్ మొత్తానికి శుభాకాంక్షల‌ని తన పోస్టును ముగించారు. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే పెద్ది ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. విడుదలైన ఐదు రోజుల్లోనే భారత్‌లో రూ.169.70 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విదేశాల్లో ఐదో రోజు రూ.1 కోటి వసూలు చేయగా, మొత్తం ఓవర్సీస్ గ్రాస్ రూ.47 కోట్లకు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు రూ.248.92 కోట్లకు చేరుకున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment