Samantha Naga Chaitanya : టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కపుల్స్ గా ఉన్న నాగ చైతన్య, సమంత విడిపోయి దాదాపు ఏడాది గడుస్తోంది. వీరి విడాకుల విషయం ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే కాదు అభిమానుల గుండెల్లో కూడా పెద్ద బాంబు పేలినట్లు అయ్యింది. ఇప్పటికీ వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయంపై అభిమానుల్లో ఏదో రకంగా చర్చ జరుగుతూనే ఉంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చై సామ్ పై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత కూడా ఛాన్స్ దొరికితే చాలు అక్కినేని కుటుంబాన్ని ఇన్ డైరెక్ట్ గా విమర్శిస్తూనే ఉంది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట 2017లో వివాహం చేసుకుని గత ఏడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి విడాకులకు మధ్య గల అసలు కారణం ఏమిటనేది అభిమానులకు ఇప్పుడు కూడా చిక్కు ప్రశ్నగా మిగిలింది.
వీరిద్దరూ ఏమీ జరగనట్లు తమ కెరియర్ గురించి ప్లాన్స్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదే విషయంపై చైతన్య తండ్రి నాగార్జునకు కొత్త ప్రశ్న ఎదురయింది. నాగార్జున ఇటీవల బ్రహ్మాస్త్రం చిత్రంలో నటించారు. బ్రహ్మాస్త్రం చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా నాగార్జునకి నాగ చైతన్య విడాకుల గురించి ఒక ప్రశ్న ఎదురైంది. ఈ చిత్రం సందర్భంగా నాగార్జున ఒక జాతీయ మీడియాతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో నాగార్జున.. నాగచైతన్య మరియు సమంత విడాకుల విషయంపై స్పందించారు.
నాగ చైతన్య ప్రొఫెషనల్ లైఫ్ కంటే తన పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది అతన్ని భాదించడం లేదా ? అని మీడియా వాళ్లు నాగార్జునను ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ.. నాగ చైతన్య ప్రస్తుతం సంతోషంగా ఉన్నాడు. చైతూ లైఫ్ లో సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. నాగ చైతన్య జీవితంలో జరిగింది ఒక అనుభవం. కానీ అది ఒక దురదృష్టకరమైన సంఘటన. జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేము. మేము మాది అనుకున్నది మా జీవితాల నుంచి వెళ్ళిపోయింది. ఎవరి జీవితంలోనైనా ఒక సమస్య ఎదురైతే దాని నుంచి బయట పడాలి అంటూ ఇంటర్వ్యూ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు నాగార్జున.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…