Samantha Naga Chaitanya : స‌మంత అనే పీడ వ‌దిలిపోయిందా.. నాగ‌చైత‌న్య విడాకుల‌పై నాగార్జున తొలిసారి స్పంద‌న‌..

September 15, 2022 2:55 PM

Samantha Naga Chaitanya : టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కపుల్స్ గా ఉన్న నాగ చైతన్య, సమంత విడిపోయి దాదాపు ఏడాది గడుస్తోంది. వీరి విడాకుల విషయం ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే కాదు అభిమానుల గుండెల్లో కూడా పెద్ద బాంబు పేలినట్లు అయ్యింది. ఇప్పటికీ వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయంపై  అభిమానుల్లో ఏదో రకంగా చర్చ జరుగుతూనే ఉంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చై సామ్ పై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత కూడా ఛాన్స్ దొరికితే చాలు అక్కినేని కుటుంబాన్ని ఇన్ డైరెక్ట్ గా విమర్శిస్తూనే ఉంది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట 2017లో వివాహం చేసుకుని గత ఏడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి విడాకులకు మధ్య గల అసలు కారణం ఏమిటనేది అభిమానుల‌కు ఇప్పుడు కూడా చిక్కు ప్రశ్నగా మిగిలింది.

Samantha Naga Chaitanya divorce issue Nagarjuna responded for the first time
Samantha Naga Chaitanya

వీరిద్దరూ ఏమీ జరగనట్లు తమ కెరియర్ గురించి ప్లాన్స్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదే విషయంపై చైతన్య తండ్రి నాగార్జునకు కొత్త ప్రశ్న ఎదురయింది. నాగార్జున ఇటీవల బ్రహ్మాస్త్రం చిత్రంలో నటించారు. బ్రహ్మాస్త్రం చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా నాగార్జునకి నాగ చైతన్య విడాకుల గురించి ఒక ప్రశ్న ఎదురైంది. ఈ చిత్రం సందర్భంగా నాగార్జున ఒక జాతీయ మీడియాతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో నాగార్జున.. నాగచైతన్య మరియు సమంత విడాకుల విషయంపై స్పందించారు.

నాగ చైతన్య ప్రొఫెషనల్ లైఫ్ కంటే తన పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది అతన్ని భాదించడం లేదా ? అని మీడియా వాళ్లు నాగార్జునను  ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ..  నాగ చైతన్య ప్రస్తుతం సంతోషంగా ఉన్నాడు.  చైతూ లైఫ్ లో సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. నాగ చైతన్య జీవితంలో జరిగింది ఒక అనుభవం. కానీ అది ఒక దురదృష్టకరమైన సంఘటన. జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేము. మేము మాది అనుకున్నది మా జీవితాల నుంచి వెళ్ళిపోయింది. ఎవరి జీవితంలోనైనా ఒక సమస్య ఎదురైతే దాని నుంచి బయట పడాలి అంటూ ఇంటర్వ్యూ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు నాగార్జున.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now