Suhasini : నందమూరి తారక రామారావు అంటే ఒక గొప్ప నటుడు. ఈయనను తెలుగు ప్రజలు అన్నగారు అని ప్రేమగా పిలుచుకుంటారు. ఎన్టీఆర్ పలు భాషలలో సుమారుగా 400 చిత్రాలలో నటించారు. అలాగే పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వ్యవహరించారు. ఆయన చేసే పాత్ర ఏదైనా సరే పాత్రకు జీవం పోసే గొప్ప నటుడు ఎన్టీఆర్. తెలుగు ప్రజలకు రాముడు, కృష్ణుడు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ ప్రతిరూపమే. ఇప్పటికికూడా తెలుగు తెరకు నంబర్ వన్ కథానాయకుడు ఎవరు అని అడగగానే మొదటగా ఎన్టీఆర్ పేరే చెబుతారు.
అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాలలో నటించడానికి ఎంతో మంది హీరోయిన్స్ క్యూ కట్టేవారు. ఆయన చిత్రాలలో నటించడానికి ఒక్క ఛాన్స్ వస్తే చాలని తహతహలాడిపోయేవారు. సావిత్రి, జమున, శ్రీదేవి జయసుధ, జయప్రద, వాణిశ్రీ, రాధ వంటి ఎంతో మంది తారలు ఆయన పక్కన నటించి అగ్రస్థాయి హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు అందరు హీరోయిన్స్ ఎన్టీఆర్ పక్కన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ అప్పట్లో ఒకే ఒక్క హీరోయిన్ కు ఎన్టీఆర్ సరసన ఆడిపాడే అవకాశం దక్కలేదు.
ఎన్టీఆర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే సుహాసిని కూడా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా పలు ఇంటర్వ్యూలలో అన్న గారితో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ సుహాసినికి ఆ కోరిక అలాగే మిగిలిపోయింది.
1983 లో సుహాసిని స్వాతి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో తల్లీ కూతురుగా సుహాసిని, శారద నటించారు. ఈ చిత్రంలో స్వాతి (సుహాసిని) చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న తల్లి శారదకు మళ్లీ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుంది. శారద భర్త క్యారెక్టర్ లో కొంగర జగ్గయ్య నటించారు. శారద భర్త క్యారెక్టర్ లో ముందుగా ఎన్టీఆర్ ని నటింపజేయడానికి ఆయనను సుహాసిని సంప్రదించింది అని అప్పట్లో టాక్ వినిపించింది. స్వాతి చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్ కూడా జగ్గయ్య పాత్రలో ముందుగా ఎన్టీఆర్ ని తీసుకోవాలని అనుకున్నారట.
అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించి ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల స్వాతి చిత్రంలో నటించే అవకాశం కుదరలేదు. స్వాతి చిత్రంలో సుహాసిని నటనకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…