Suhasini : ఎన్‌టీఆర్ తో క‌లిసి సుహాసిని ఎందుకు న‌టించ‌లేదు.. కార‌ణం ఏమిటంటే..?

September 15, 2022 3:51 PM

Suhasini : నందమూరి తారక రామారావు అంటే ఒక గొప్ప నటుడు. ఈయనను తెలుగు ప్రజలు అన్నగారు అని ప్రేమగా పిలుచుకుంటారు. ఎన్టీఆర్ పలు భాషలలో సుమారుగా 400 చిత్రాలలో నటించారు. అలాగే పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వ్యవహరించారు. ఆయన చేసే పాత్ర ఏదైనా సరే పాత్రకు  జీవం పోసే గొప్ప నటుడు ఎన్టీఆర్. తెలుగు ప్రజలకు రాముడు, కృష్ణుడు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ ప్రతిరూపమే. ఇప్పటికికూడా తెలుగు తెరకు నంబర్  వన్ కథానాయకుడు ఎవరు అని అడగగానే మొదటగా ఎన్టీఆర్ పేరే చెబుతారు.

అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాలలో నటించడానికి ఎంతో మంది హీరోయిన్స్ క్యూ కట్టేవారు. ఆయన చిత్రాలలో నటించడానికి ఒక్క ఛాన్స్ వస్తే చాలని తహతహలాడిపోయేవారు. సావిత్రి, జమున, శ్రీదేవి జయసుధ, జయప్రద, వాణిశ్రీ, రాధ వంటి ఎంతో మంది తారలు ఆయన పక్కన నటించి అగ్రస్థాయి హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు అందరు హీరోయిన్స్ ఎన్టీఆర్ పక్కన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ అప్పట్లో ఒకే ఒక్క హీరోయిన్ కు ఎన్టీఆర్ సరసన ఆడిపాడే అవకాశం దక్కలేదు.

why Suhasini not acted with senior ntr
Suhasini

ఎన్టీఆర్ మంచి ఫామ్‌లో ఉన్న‌ సమయంలోనే సుహాసిని కూడా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా పలు ఇంటర్వ్యూలలో అన్న గారితో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ సుహాసినికి ఆ కోరిక అలాగే మిగిలిపోయింది.

1983 లో సుహాసిని స్వాతి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో తల్లీ కూతురుగా సుహాసిని, శారద నటించారు. ఈ చిత్రంలో స్వాతి (సుహాసిని) చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న తల్లి శారదకు మళ్లీ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుంది. శారద భర్త క్యారెక్టర్ లో కొంగర జగ్గయ్య నటించారు. శారద భర్త క్యారెక్టర్ లో ముందుగా ఎన్టీఆర్ ని నటింపజేయడానికి ఆయనను సుహాసిని సంప్రదించింది అని అప్పట్లో టాక్ వినిపించింది. స్వాతి చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్ కూడా జగ్గయ్య పాత్రలో ముందుగా ఎన్టీఆర్ ని తీసుకోవాలని అనుకున్నారట.

అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించి ఆ పనుల్లో  బిజీగా ఉండడం వల్ల స్వాతి చిత్రంలో నటించే అవకాశం కుదరలేదు. స్వాతి చిత్రంలో సుహాసిని నటనకు బెస్ట్ యాక్ట‌ర్‌ గా నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment