Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం సమంతకు పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పటికీ ఈ విషయంలో ఆమెను విమర్శిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల ఆమె పుష్ప సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్‌కు పొగడ్తలు ఎన్ని వచ్చాయో, విమర్శలు కూడా అన్నే వచ్చాయి. అయినప్పటికీ ఆమె వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉంది.
ఇక తాజాగా కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్‌లు చాలా వరకు నిలిచిపోయాయి. దీంతో సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కొందరు విహార యాత్రలకు వెళ్తున్నారు. సమంత కూడా తన స్నేహితులతో కలిసి తాజాగా మళ్లీ టూర్‌కెళ్లింది. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వత శ్రేణుల్లో గడుపుతోంది.
అయితే ఈ విషయంపై కూడా కొందరు సమంతను విమర్శిస్తున్నారు. ఓ వైపు ఒమిక్రాన్, డెల్టా వేరియెంట్లతో ప్రపంచం మొత్తం కష్టాలు పడుతుంటే.. నువ్వు మాత్రం విహార యాత్రల్లో ఎంజాయ్ చేస్తున్నావా ? సమాజం అంటే అసలు ఇంత కూడా బాధ్యత లేదా ? ఇలాగేనా ప్రవర్తించేది ? అంటూ సమంతను ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో సమంతపై ట్రోల్స్ మళ్లీ మొదలయ్యాయి. అయితే ఈ విమర్శలకు సమంత ఇంకా రిప్లై ఇవ్వలేదు. కానీ వీటికి ఆమె స్పందిస్తుందని తెలుస్తోంది. మరి ఆమె ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…