Samantha : ఓ వైపు ప్ర‌పంచమంతా క‌ష్టాల్లో ఉంటే.. నువ్వు విహార యాత్ర‌ల్లో ఎంజాయ్ చేస్తావా స‌మంత‌..?

January 21, 2022 5:28 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం స‌మంత‌కు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ఇప్ప‌టికీ ఈ విష‌యంలో ఆమెను విమ‌ర్శిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవ‌ల ఆమె పుష్ప సినిమాలో చేసిన ఐట‌మ్ సాంగ్‌కు పొగ‌డ్త‌లు ఎన్ని వ‌చ్చాయో, విమ‌ర్శ‌లు కూడా అన్నే వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ ఆమె వాట‌న్నింటినీ ప‌ట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉంది.

Samantha  enjoying in Switzerland netizen troll her

ఇక తాజాగా కోవిడ్ కార‌ణంగా సినిమా షూటింగ్‌లు చాలా వ‌ర‌కు నిలిచిపోయాయి. దీంతో సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. కొంద‌రు విహార యాత్ర‌ల‌కు వెళ్తున్నారు. స‌మంత కూడా త‌న స్నేహితుల‌తో క‌లిసి తాజాగా మళ్లీ టూర్‌కెళ్లింది. ప్ర‌స్తుతం ఆమె స్విట్జ‌ర్లాండ్‌లోని మంచు ప‌ర్వ‌త శ్రేణుల్లో గ‌డుపుతోంది.

అయితే ఈ విష‌యంపై కూడా కొంద‌రు స‌మంత‌ను విమ‌ర్శిస్తున్నారు. ఓ వైపు ఒమిక్రాన్‌, డెల్టా వేరియెంట్ల‌తో ప్ర‌పంచం మొత్తం క‌ష్టాలు ప‌డుతుంటే.. నువ్వు మాత్రం విహార యాత్ర‌ల్లో ఎంజాయ్ చేస్తున్నావా ? స‌మాజం అంటే అస‌లు ఇంత కూడా బాధ్య‌త లేదా ? ఇలాగేనా ప్ర‌వ‌ర్తించేది ? అంటూ స‌మంత‌ను ట్రోల్ చేస్తూ విమ‌ర్శిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో స‌మంత‌పై ట్రోల్స్ మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. అయితే ఈ విమ‌ర్శ‌ల‌కు స‌మంత ఇంకా రిప్లై ఇవ్వ‌లేదు. కానీ వీటికి ఆమె స్పందిస్తుంద‌ని తెలుస్తోంది. మ‌రి ఆమె ఏమ‌ని స‌మాధానం చెబుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment