Painting : ఉద్యోగంలో చేరిన తొలి రోజే ఓ సెక్యూరిటీ గార్డు కోట్ల రూపాయల విలువైన పెయింటింగ్‌ను చెడగొట్టేశాడు. ఆ ఉద్యోగం అతనికి చాలా బోరింగ్‌గా ఉందని చెప్పి అతను ఆ విధంగా చేశాడు. దీంతో అతను ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అతనికి జాబ్ ఇచ్చిన కంపెనీ లక్షల రూపాయలు ఫైన్ కట్టడంతోపాటు ఆ పెయింటింగ్‌ను బాగు చేసే పనిలో పడింది. వివరాల్లోకి వెళితే..
పశ్చిమ-మధ్య రష్యాలోని స్వెర్‌డ్లోవ్‌స్క్ ఆబ్లాస్ట్ ప్రాంతంలో ఉన్న యెల్ట్‌సిన్ సెంటర్‌లో ఓ పెయింటింగ్‌ను ఈ మధ్యే ప్రదర్శనకు ఉంచారు. అది 1932 కాలానికి చెందినది. అన్నా లెపర్‌స్కయా అనే మహిళ ఆ పెయింటింగ్‌కు యజమాని. ఆ పెయింటింగ్‌ను త్రీ ఫిగర్స్ పేరిట పిలుస్తున్నారు. దీన్ని డిసెంబర్ 7, 2021వ తేదీన అక్కడి ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. తరువాత యెల్ట్‌సిన్ సెంటర్‌లో ప్రదర్శనకు ఉంచారు.
అయితే ఆ సెంటర్‌కు ఇటీవలే ఓ సెక్యూరిటీ గార్డు నియామకం అయ్యాడు. అతని వయస్సు 60 ఏళ్లు. కాగా అతను ఉద్యోగంలో చేరిన తొలిరోజే జాబ్ చాలా బోరింగ్‌గా ఉందని చెప్పి ఆ త్రీ ఫిగర్స్ పెయింటింగ్‌పై పెన్నుతో పిచ్చి గీతలు గీశాడు. ఆ పెయింటింగ్‌లో ముగ్గురు వ్యక్తుల ముఖాలు ఉంటాయి. కానీ వారికి కళ్లు, ముక్కు, నోరు లాంటివి ఏవీ ఉండవు. ముఖం ఖాళీగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఆ సెక్యూరిటీ గార్డు ఆ ముగ్గురు వ్యక్తుల చిత్రాల్లో ఇద్దరి ముఖాలపై బాల్ పాయింట్ పెన్నుతో కళ్లను గీశాడు. దీంతో పెయింటింగ్ మొత్తం చెడిపోయింది. అయితే సదరు సెంటర్ వారు ఆ సెక్యూరిటీ గార్డును వెంటనే ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే వారు ఆ పెయింటింగ్ ఓనర్‌కు రూ.39,900 ఫైన్ చెల్లించారు. ఇక కొందరు నిపుణులైన పెయింటర్లను పెట్టి దాన్ని బాగు చేయించే పని చేస్తున్నారు. అందుకు గాను రూ.2,49,500 వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఆ పెయింటింగ్ ఖరీదు అక్షరాలా 1 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపుగా రూ.7.47 కోట్లు. కాగా దానికి ఇన్సూరెన్స్ సైతం ఉంది. ఆ పెయింటింగ్‌ను వారు బాగు చేయలేకపోతే ఓనర్‌కు ఆ మొత్తం ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. అంటే.. ఎటు తిరిగి ఆ సెంటర్ వారికే నష్టమన్నమాట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…