Painting : రూ.7.47 కోట్ల విలువ చేసే పెయింటింగ్‌.. పెన్నుతో పిచ్చి గీత‌లు గీసి చెడ‌గొట్టిన సెక్యూరిటీ గార్డు..!

February 10, 2022 1:37 PM

Painting : ఉద్యోగంలో చేరిన తొలి రోజే ఓ సెక్యూరిటీ గార్డు కోట్ల రూపాయ‌ల విలువైన పెయింటింగ్‌ను చెడ‌గొట్టేశాడు. ఆ ఉద్యోగం అత‌నికి చాలా బోరింగ్‌గా ఉంద‌ని చెప్పి అత‌ను ఆ విధంగా చేశాడు. దీంతో అత‌ను ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అత‌నికి జాబ్ ఇచ్చిన కంపెనీ ల‌క్ష‌ల రూపాయ‌లు ఫైన్ క‌ట్ట‌డంతోపాటు ఆ పెయింటింగ్‌ను బాగు చేసే ప‌నిలో ప‌డింది. వివ‌రాల్లోకి వెళితే..

Rs 7.47 crores valued painting security guard wrote with pen
Painting

ప‌శ్చిమ‌-మ‌ధ్య ర‌ష్యాలోని స్వెర్‌డ్లోవ్‌స్క్ ఆబ్లాస్ట్ ప్రాంతంలో ఉన్న యెల్ట్‌సిన్ సెంట‌ర్‌లో ఓ పెయింటింగ్‌ను ఈ మ‌ధ్యే ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. అది 1932 కాలానికి చెందిన‌ది. అన్నా లెప‌ర్‌స్క‌యా అనే మ‌హిళ ఆ పెయింటింగ్‌కు య‌జ‌మాని. ఆ పెయింటింగ్‌ను త్రీ ఫిగ‌ర్స్ పేరిట పిలుస్తున్నారు. దీన్ని డిసెంబ‌ర్ 7, 2021వ తేదీన అక్క‌డి ఓ ఎగ్జిబిష‌న్‌లో ప్ర‌ద‌ర్శించారు. త‌రువాత యెల్ట్‌సిన్ సెంట‌ర్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు.

అయితే ఆ సెంట‌ర్‌కు ఇటీవ‌లే ఓ సెక్యూరిటీ గార్డు నియామ‌కం అయ్యాడు. అత‌ని వ‌య‌స్సు 60 ఏళ్లు. కాగా అత‌ను ఉద్యోగంలో చేరిన తొలిరోజే జాబ్ చాలా బోరింగ్‌గా ఉంద‌ని చెప్పి ఆ త్రీ ఫిగ‌ర్స్ పెయింటింగ్‌పై పెన్నుతో పిచ్చి గీత‌లు గీశాడు. ఆ పెయింటింగ్‌లో ముగ్గురు వ్య‌క్తుల ముఖాలు ఉంటాయి. కానీ వారికి క‌ళ్లు, ముక్కు, నోరు లాంటివి ఏవీ ఉండ‌వు. ముఖం ఖాళీగా ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే ఆ సెక్యూరిటీ గార్డు ఆ ముగ్గురు వ్య‌క్తుల చిత్రాల్లో ఇద్ద‌రి ముఖాల‌పై బాల్ పాయింట్ పెన్నుతో క‌ళ్ల‌ను గీశాడు. దీంతో పెయింటింగ్ మొత్తం చెడిపోయింది. అయితే స‌ద‌రు సెంట‌ర్ వారు ఆ సెక్యూరిటీ గార్డును వెంట‌నే ఉద్యోగం నుంచి తొల‌గించారు. ఈ క్ర‌మంలోనే వారు ఆ పెయింటింగ్ ఓన‌ర్‌కు రూ.39,900 ఫైన్ చెల్లించారు. ఇక కొంద‌రు నిపుణులైన పెయింట‌ర్ల‌ను పెట్టి దాన్ని బాగు చేయించే ప‌ని చేస్తున్నారు. అందుకు గాను రూ.2,49,500 వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక ఆ పెయింటింగ్ ఖ‌రీదు అక్ష‌రాలా 1 మిలియ‌న్ డాల‌ర్లు.. అంటే దాదాపుగా రూ.7.47 కోట్లు. కాగా దానికి ఇన్సూరెన్స్ సైతం ఉంది. ఆ పెయింటింగ్‌ను వారు బాగు చేయ‌లేక‌పోతే ఓన‌ర్‌కు ఆ మొత్తం ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. అంటే.. ఎటు తిరిగి ఆ సెంట‌ర్ వారికే న‌ష్ట‌మ‌న్న‌మాట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now