RRR : జనవరి 7న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు రాజమౌళి. ఈ సినిమాని భారీ హిట్ చేసేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాడు. విడుదల దగ్గర పడే వరకు వెరైటీ ప్రమోషన్స్ చేస్తూ.. సినిమాను బాహుబలిని మించిన హిట్ చేయాలని నిర్ణయించుకున్నారు అనిపిస్తోంది. ఇటీవల ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని పెంచేసింది.
కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ బడా సెలబ్రిటీలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇక సౌత్‌లో కూడా రాజమౌళి ఇదే రేంజ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతకంటే ముందు ఓవర్సీస్ మార్కెట్ పై కన్నేసింది ఆర్ఆర్ఆర్ టీమ్. గత కొద్ది రోజులుగా ముంబైలో ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్. ఇప్పుడు వీరితో భళ్లాలదేవుడు రానా జతకట్టాడు.
బాహుబలి సినిమాతో రానా క్రేజ్ కూడా పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ టీంని కలిసి ఫొటోలకి ఫోజిచ్చాడు. అయితే ఆర్ఆర్ఆర్ టీంతో రానా జతకట్టడానికి కారణం ఏమై ఉంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ కాగా, ఆయన ఆర్ఆర్ఆర్ బృందంతో కలిసి దిగిన పిక్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. పిక్చర్ పర్‌ఫెక్ట్ అంటున్నారు నెటిజన్స్.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…