Pushpa : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కరోనా రెండో వేవ్ తరువాత విడుదల చిత్రాల్లో సక్సెస్ సాధించిన చిత్రాలు కొన్నే ఉన్నాయి. అలాంటి వాటిలో పుష్ప ఒకటి. పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌లు నిర్వహిస్తూ వస్తోంది.
అయితే ఈ సినిమాలో నటించిన వారు అందరూ దాదాపుగా ప్రేక్షకులకు తెలుసు. కానీ అల్లు అర్జున్‌కు తల్లిపాత్రలో నటించిన నటి మాత్రం చాలా మంది తెలియదు. నిజానికి ఆమెను ఈ సినిమాకు గాను సుకుమార్ ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు. ఇంతకీ అసలు ఆమె ఎవరంటే..
పుష్ప మూవీలో అల్లు అర్జున్‌కు తల్లిగా నటించిన ఆమె పేరు.. కల్పలత. ఈమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. కానీ పుష్పతో ఈమెకు బాగా గుర్తింపు లభించింది. దీంతో ఇప్పుడు ఈమె గురించి అందరూ వెదకడం మొదలు పెట్టారు.
ఇక చిత్రంలో నటించేందుకు గాను 6 నెలల ముందే తనకు ఆడిషన్ నిర్వహించారని.. 6 నెలల తరువాత చిత్రంలో అల్లు అర్జున్ కు తల్లిగా నటించే అవకాశం లభించిందని ఫోన్ చేసి చెప్పారని తెలిపింది. ఆ సమయంలో తాను ఎంతో ఆనందంగా ఫీలయ్యానని వివరించింది. తనకు ఈ పాత్ర ఇచ్చినందుకు సుకుమార్‌కు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…