Pushpa Movie : అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్ దశ నుంచే భారీ హైప్ క్రియేట్ చేసుకుంటూ వచ్చిన ఈ సినిమాకు ఆశించిన దాన్ని మించిన ఓపెనింగ్స్ దక్కాయి. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినా తొలి మూడు రోజులు థియేటర్లలో హవా నడిపించాడు పుష్పరాజ్. రీసెంట్‌గా ఈ చిత్రం తిరుపతిలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకోగా, పుష్ప టీం అంతా సందడి చేసింది.
పుష్ప చిత్రం నెట్‌ఫ్లిక్స్‌కి చెందిన వెబ్ సిరీస్‌కి కాపీ అని ప్రచారం నడుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘నార్కోస్’ కథ ఆధారంగా ‘పుష్ప’ను రూపొందించాడంటూ తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు. ‘నార్కోస్’లో డ్రగ్స్ మాఫియా ఉంటే.. ‘పుష్ప’లో ఎర్రచందనం స్మగ్లింగ్ చూపించారని , వెబ్ సిరీస్ హీరో పాత్ర ఆధారంగా పుష్పలో అల్లు అర్జున్ పాత్ర తీర్చిదిద్దాడని, అలాగే కొండారెడ్డి బ్రదర్స్ పాత్రలు కూడా వెబ్ సిరీస్ ఆధారంగానే సుకుమార్ రాసుకున్నారని అంటున్నారు.
అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రాన్ని ఇలా తెరకెక్కించడంపై బన్నీ అభిమానులు సుకుమార్‌పై మండిపడుతున్నారు. వచ్చే ఏడాది పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం కానుండగా, ఇందులో పాత్రలు మరింత పవర్ ఫుల్‌గా కనిపించనున్నాయట. తొలి పార్ట్ కాస్త నెగెటివిటీని దక్కించుకోగా, రెండో పార్ట్ అంచనాలను మించేలా ఉంటుందా అని అందరూ చర్చించుకుంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…