Pushpa Movie : పుష్ప సినిమాని ఆ వెబ్ సిరీస్ నుండి సుకుమార్ కాపీ కొట్టాడా.. మండిప‌డుతున్న ఫ్యాన్స్..

December 23, 2021 11:09 AM

Pushpa Movie : అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. షూటింగ్ దశ నుంచే భారీ హైప్ క్రియేట్ చేసుకుంటూ వచ్చిన ఈ సినిమాకు ఆశించిన దాన్ని మించిన ఓపెనింగ్స్ దక్కాయి. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినా తొలి మూడు రోజులు థియేటర్లలో హవా నడిపించాడు పుష్పరాజ్. రీసెంట్‌గా ఈ చిత్రం తిరుప‌తిలో స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేసుకోగా, పుష్ప టీం అంతా సంద‌డి చేసింది.

Pushpa Movie is sukumar copied from that web series

పుష్ప చిత్రం నెట్‌ఫ్లిక్స్‌కి చెందిన వెబ్ సిరీస్‌కి కాపీ అని ప్ర‌చారం న‌డుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘నార్కోస్’ కథ ఆధారంగా ‘పుష్ప’ను రూపొందించాడంటూ తమదైన శైలిలో ట్రోల్‌ చేస్తున్నారు. ‘నార్కోస్’లో డ్రగ్స్ మాఫియా ఉంటే.. ‘పుష్ప’లో ఎర్రచందనం స్మగ్లింగ్ చూపించారని , వెబ్ సిరీస్ హీరో పాత్ర ఆధారంగా పుష్పలో అల్లు అర్జున్ పాత్ర తీర్చిదిద్దాడని, అలాగే కొండారెడ్డి బ్రదర్స్ పాత్రలు కూడా వెబ్ సిరీస్ ఆధారంగానే సుకుమార్ రాసుకున్నారని అంటున్నారు.

అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రాన్ని ఇలా తెరకెక్కించ‌డంపై బ‌న్నీ అభిమానులు సుకుమార్‌పై మండిప‌డుతున్నారు. వ‌చ్చే ఏడాది పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం కానుండ‌గా, ఇందులో పాత్ర‌లు మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపించ‌నున్నాయ‌ట‌. తొలి పార్ట్ కాస్త నెగెటివిటీని ద‌క్కించుకోగా, రెండో పార్ట్ అంచ‌నాలను మించేలా ఉంటుందా అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now