గురువారం, జూన్ 11, 2026
వార్తలు

RRR : నలుగురూ ఒకే చోట చేరారు ? కారణం ఏమై ఉంటుందబ్బా..?

RRR : జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్ర‌భంజ‌నం సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు రాజ‌మౌళి. ఈ సినిమాని భారీ హిట్ చేసేందుకు స‌ర్వ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నాడు. విడుదల దగ్గర పడే వరకు వెరైటీ ప్రమోషన్స్ చేస్తూ.. సినిమాను బాహుబలిని…

RRR : నలుగురూ ఒకే చోట చేరారు ? కారణం ఏమై ఉంటుందబ్బా..?

RRR : జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్ర‌భంజ‌నం సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు రాజ‌మౌళి. ఈ సినిమాని భారీ హిట్ చేసేందుకు స‌ర్వ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నాడు. విడుదల దగ్గర పడే వరకు వెరైటీ ప్రమోషన్స్ చేస్తూ.. సినిమాను బాహుబలిని మించిన హిట్ చేయాలని నిర్ణయించుకున్నారు అనిపిస్తోంది. ఇటీవల ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని పెంచేసింది.

RRR rajamouli ntr charan and rana at one place what is the reason

కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ బడా సెలబ్రిటీలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇక సౌత్‌లో కూడా రాజమౌళి ఇదే రేంజ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతకంటే ముందు ఓవర్సీస్ మార్కెట్‌ పై కన్నేసింది ఆర్ఆర్ఆర్ టీమ్. గ‌త కొద్ది రోజులుగా ముంబైలో ప్ర‌మోష‌న్స్ చేస్తూ బిజీగా ఉన్నారు రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, ఎన్టీఆర్. ఇప్పుడు వీరితో భ‌ళ్లాల‌దేవుడు రానా జ‌త‌క‌ట్టాడు.

బాహుబ‌లి సినిమాతో రానా క్రేజ్ కూడా పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. తాజాగా ఆయ‌న ఆర్ఆర్ఆర్ టీంని క‌లిసి ఫొటోలకి ఫోజిచ్చాడు. అయితే ఆర్ఆర్ఆర్ టీంతో రానా జ‌త‌క‌ట్ట‌డానికి కార‌ణం ఏమై ఉంటుంద‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ కాగా, ఆయ‌న ఆర్ఆర్ఆర్ బృందంతో క‌లిసి దిగిన పిక్ మాత్రం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అంటున్నారు నెటిజ‌న్స్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి