Viral Video : ప్రస్తుత తరుణంలో డబ్బులు సంపాదించడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఒక్క రూపాయి సంపాదించాలంటేనే గగనంగా మారింది. ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావడం లేదు. అయితే ఆ వ్యక్తి మాత్రం తన వద్ద ఉన్న డబ్బులను బహిరంగంగా అందరి మధ్య వెదజల్లేశాడు. వందలు, వేల రూపాయల నోట్లను అతను విసిరిపారేశాడు. అయితే అతను ధనికుడు అయి ఉండవచ్చు.. అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఎందుకంటే.. అతను బిచ్చగాడు.
అవును.. బిచ్చగాడు అయి ఉండి కూడా తన వద్ద ఉన్న డబ్బును ఎందుకు అతను అలా విసిరిశాడు.. అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పట్టణంలో ఉన్న నాగ్డా రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు చాలా మంది ఉన్నారు. ఎప్పటిలాగే స్టేషన్‌లో వచ్చీ పోయే రైళ్లు, ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ప్లాట్ ఫామ్ మీదకు వచ్చి ఒక్కసారిగా తన వద్ద ఉన్న సంచిలోంచి రూ.100, రూ.200, రూ.500 విలువ ఉన్న నోట్లను గాల్లోకి వెదజల్లేశాడు. దీంతో అక్కడ ఉన్న వారికి అసలు ఏం జరుగుతుందో తెలియలేదు.
ఇక ఆ నోట్లను చల్లడం అయిపోగానే ఆ వ్యక్తి తన సంచిలో ఉన్న కొన్ని పత్రాలను బయటకు తీసి విసిరేశాడు. పరిశీలించి చూస్తే అవి ఏవో స్థలానికి సంబంధించినవిగా తేలింది. అయితే అతను ఇలా ఎందుకు చేశాడనే విషయం తెలియడం లేదు. కానీ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతని వద్ద ఉన్న నోట్లను, కాగితాలను అన్నింటినీ సర్ది ఆ బిచ్చగాడి సంచిలో వేసి అతన్ని అక్కడి నుంచి పంపించివేశారు.
అతనిది అక్కడికి సమీపంలో ఉన్న బుర్హాన్‌పూర్ అని తెలుసుకుని అక్కడికి వెళ్లే రైలులో అతన్ని ఎక్కించి పంపించివేశారు. అయితే అతను ఓ రైతు అని, మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని.. అందువల్లే ఈ విధంగా బిచ్చగాడిలా మారాడని.. ఈ క్రమంలోనే నోట్లను, పేపర్లను అలా విసిరేసి ఉంటాడని భావిస్తున్నారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…