Viral Video : అత‌ను బిచ్చ‌గాడు.. కానీ సంచిలోంచి భారీ ఎత్తున నోట్ల క‌ట్ట‌ల‌ను తీసి రైల్వే స్టేష‌న్‌లో విసిరేశాడు.. ఎందుకంటే..?

December 23, 2021 2:10 PM

Viral Video : ప్ర‌స్తుత త‌రుణంలో డ‌బ్బులు సంపాదించ‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ఒక్క రూపాయి సంపాదించాలంటేనే గ‌గ‌నంగా మారింది. ఎంతో క‌ష్ట‌ప‌డితే కానీ డ‌బ్బులు రావ‌డం లేదు. అయితే ఆ వ్య‌క్తి మాత్రం త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బుల‌ను బ‌హిరంగంగా అంద‌రి మ‌ధ్య వెద‌జ‌ల్లేశాడు. వంద‌లు, వేల రూపాయ‌ల నోట్ల‌ను అత‌ను విసిరిపారేశాడు. అయితే అత‌ను ధ‌నికుడు అయి ఉండ‌వ‌చ్చు.. అని అనుకుంటే మీరు పొర‌పాటు ప‌డిన‌ట్లే. ఎందుకంటే.. అత‌ను బిచ్చ‌గాడు.

Viral Video beggar thrown currency notes on railway platform

అవును.. బిచ్చ‌గాడు అయి ఉండి కూడా త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బును ఎందుకు అత‌ను అలా విసిరిశాడు.. అనే విష‌యం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఉజ్జ‌యిని ప‌ట్ట‌ణంలో ఉన్న నాగ్డా రైల్వే స్టేష‌న్‌లో ప్ర‌యాణికులు చాలా మంది ఉన్నారు. ఎప్ప‌టిలాగే స్టేష‌న్‌లో వ‌చ్చీ పోయే రైళ్లు, ప్ర‌యాణికుల‌తో ర‌ద్దీగా ఉంది. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి ప్లాట్ ఫామ్ మీద‌కు వ‌చ్చి ఒక్క‌సారిగా త‌న వ‌ద్ద ఉన్న సంచిలోంచి రూ.100, రూ.200, రూ.500 విలువ ఉన్న నోట్ల‌ను గాల్లోకి వెద‌జ‌ల్లేశాడు. దీంతో అక్క‌డ ఉన్న వారికి అస‌లు ఏం జ‌రుగుతుందో తెలియ‌లేదు.

ఇక ఆ నోట్ల‌ను చ‌ల్ల‌డం అయిపోగానే ఆ వ్య‌క్తి త‌న సంచిలో ఉన్న కొన్ని ప‌త్రాల‌ను బ‌య‌ట‌కు తీసి విసిరేశాడు. ప‌రిశీలించి చూస్తే అవి ఏవో స్థ‌లానికి సంబంధించిన‌విగా తేలింది. అయితే అత‌ను ఇలా ఎందుకు చేశాడ‌నే విష‌యం తెలియ‌డం లేదు. కానీ విష‌యం తెలుసుకున్న రైల్వే పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకుని అత‌ని వ‌ద్ద ఉన్న నోట్ల‌ను, కాగితాల‌ను అన్నింటినీ స‌ర్ది ఆ బిచ్చ‌గాడి సంచిలో వేసి అత‌న్ని అక్క‌డి నుంచి పంపించివేశారు.

అత‌నిది అక్కడికి స‌మీపంలో ఉన్న బుర్హాన్‌పూర్ అని తెలుసుకుని అక్క‌డికి వెళ్లే రైలులో అత‌న్ని ఎక్కించి పంపించివేశారు. అయితే అత‌ను ఓ రైతు అని, మానసిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని.. అందువ‌ల్లే ఈ విధంగా బిచ్చ‌గాడిలా మారాడని.. ఈ క్ర‌మంలోనే నోట్ల‌ను, పేప‌ర్ల‌ను అలా విసిరేసి ఉంటాడ‌ని భావిస్తున్నారు. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now