1991లో సర్పయాగం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.. హీరోయిన్ రోజా. 1990 దశాబ్దంలో హీరోయిన్ రోజా అంటే కుర్రకారులో ఎంతో క్రేజ్ ఉండేది. నటన పరంగా ఆమెకు గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంత అద్భుతంగా ఉంటాయి రోజా ఎక్స్‌ప్రెషన్స్. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఆమెకు ఎంత మంది అభిమానులు ఉన్నారు.
2002లో ఆర్కె సెల్వమణిని వివాహం చేసుకొని సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం విరామంతో అటు పొలిటిషన్ గానూ, ఇటు సినిమాలలోనూ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. దీనితోపాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి జడ్జ్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో అలరించారు రోజా. జబర్దస్త్, బతుకు జట్కా బండి వంటి కార్యక్రమాలకి హోస్ట్ గా వ్యవహరించారు.
గత 10 ఏళ్లుగా జబర్దస్త్ షో కి జడ్జిగా వ్యవహరిస్తూ ఎన్నో లక్షల రెమ్యునరేషన్‌ను అందుకున్నారు. వైసీపీ పార్టీలో మినిస్టర్ గా కూడా ప్రమోషన్ సాధించారు రోజా. బాధ్యతలు పెరగడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. రోజా ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. కోటికి పైగా ఖరీదు ఉండే ఒక ఖరీదైన కారును రోజా కొనుగోలు చేశారు. కొడుకుతో కలిసి ఆ కారుతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాకుండా అక్రమ సంపాదనను ఎంత వెనుక వేసి ఉంటారో ఇలాంటి ఖరీదైన కారు కొనడానికి అంటూ ప్రతిపక్షాల నుంచి రోజా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఈ విమర్శలకు దీటుగా రోజా తనదైన శైలిలో చాలా సరైన సమాధానం ఇచ్చారు. నేను 150 చిత్రాలకు పైగా నటించాను. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించాను. అక్కడ నాకు లక్షల్లో రెమ్యూనరేషన్ అందేది.
అక్రమ ఆస్తులను వెనుక వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా కావాలంటే నేను కట్టే ఇన్ కమ్ టాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు అని ప్రతిపక్షాలపై మండిపడింది రోజా. ఈ వివాదంతో జబర్దస్త్ లో రోజా తీసుకునే రెమ్యూనరేషన్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…