ఖ‌రీదైన కారు కొన‌డంపై విమ‌ర్శ‌లు.. దీటుగా బ‌దులు చెప్పిన రోజా..

August 19, 2022 2:21 PM

1991లో సర్పయాగం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.. హీరోయిన్ రోజా. 1990 దశాబ్దంలో హీరోయిన్ రోజా అంటే కుర్రకారులో ఎంతో క్రేజ్ ఉండేది. నటన పరంగా ఆమెకు గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంత అద్భుతంగా ఉంటాయి రోజా ఎక్స్‌ప్రెషన్స్. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఆమెకు ఎంత మంది అభిమానులు ఉన్నారు.

2002లో ఆర్కె సెల్వమణిని వివాహం చేసుకొని సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం విరామంతో అటు పొలిటిషన్ గానూ, ఇటు సినిమాలలోనూ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. దీనితోపాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి జడ్జ్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో అలరించారు రోజా. జబర్దస్త్, బతుకు జట్కా బండి వంటి కార్యక్రమాలకి హోస్ట్ గా వ్యవహరించారు.

roja responded on her recent car purchase comments

గత 10 ఏళ్లుగా జబర్దస్త్ షో కి జడ్జిగా వ్యవహరిస్తూ ఎన్నో లక్షల రెమ్యునరేషన్‌ను అందుకున్నారు. వైసీపీ పార్టీలో మినిస్టర్ గా కూడా ప్రమోషన్ సాధించారు రోజా. బాధ్యతలు పెరగడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. రోజా ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. కోటికి పైగా ఖరీదు ఉండే ఒక ఖ‌రీదైన‌ కారును రోజా కొనుగోలు చేశారు. కొడుకుతో కలిసి ఆ కారుతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాకుండా అక్రమ సంపాదనను ఎంత వెనుక వేసి ఉంటారో ఇలాంటి ఖరీదైన కారు కొనడానికి అంటూ  ప్రతిపక్షాల నుంచి రోజా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఈ విమర్శలకు దీటుగా రోజా తనదైన శైలిలో చాలా సరైన సమాధానం ఇచ్చారు. నేను 150 చిత్రాలకు పైగా నటించాను. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించాను. అక్కడ నాకు లక్షల్లో రెమ్యూనరేషన్ అందేది.

అక్రమ ఆస్తులను వెనుక వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా కావాలంటే నేను కట్టే ఇన్ కమ్ టాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు అని ప్రతిపక్షాలపై మండిపడింది రోజా. ఈ వివాదంతో జబర్దస్త్ లో రోజా తీసుకునే రెమ్యూనరేషన్ విష‌యం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now