అక్కినేని సినీ వారసుడిగా జోష్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు నాగ చైతన్య. మొదటి చిత్రంతోనే పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత ఏం మాయ చేశావె చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసి బాక్సాఫీస్ వద్ద హిట్ ను చేజిక్కించుకున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
గత ఏడాది అక్టోబర్ లో సమంతతో వివాహ బంధానికి స్వస్తి చెప్పాడు. విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది నాగచైతన్య పేరు. సమంత కూడా సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్యపై పరోక్షంగా కామెంట్స్ చేస్తూనే ఉంది. ఎన్ని కామెంట్స్ ఎదురైనా కూడా ఆయన పని ఆయన కూల్ గా చేసుకుంటూ పోతున్నాడు. వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా సినిమాలను మాత్రం దూరం పెట్టలేదు.
నాగచైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా చిత్రంలో అమీర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్య ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్య క్యారెక్టర్ పేరు బాలరాజు అని వార్తలు వినిపిస్తున్నాయి. మొదట లాల్ సింగ్ చడ్డాలో నటించడానికి నాగచైతన్య ఇష్టం చూపించలేదంట. సినిమా కథ వినే సమయంలో సమంతతో వ్యక్తిగత గొడవలు జరుగుతూ ఉండడంతో నటించడానికి నో చెప్పాడట.
నాగచైతన్యకు ఇష్టం లేకపోయినా నాగార్జున దగ్గరుండి మరీ ఈ చిత్ర కథకు సైన్ చేయించారట. ఇటీవల విడుదలైన నాగచైతన్య థాంక్యూ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మరీ లాల్ సింగ్ చడ్డా చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్ లో ఎలాంటి విజయం అందుకుంటాడో వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…