టెలివిజన్ రంగంలో జబర్దస్త్ క్రేజ్ మాములుగా ఉండదు. దీనికి తోడు యూట్యూబ్ లో కూడా ఆ వీడియోలే ట్రెండ్ అవుతూ ఉంటాయి. కానీ ఇటీవల ఒక్కసారిగా ఈ షో రేటింగ్ డౌన్ అయినట్టు కనిపిస్తోంది. దీనికి ముఖ్య కారణం ఈ కామెడీ షో నుంచి కొంత మంది కమెడియన్స్ బయటకు వెళ్లిపోతూ అనేక రకాల ఆరోపణలు చేయడమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం జబర్దస్త్ షోకి నటి ఇంద్రజ, ప్రగతి జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు.
లేటెస్ట్ గా జబర్దస్త్ షో ప్రోమో విడుదలైంది. ఎప్పటిలాగే కామెడీ పంచ్ లతో ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. చలాకి చంటి, నూకరాజు, రాకెట్ రాఘవ ఇలా ప్రతి ఒక్కరి స్కిట్స్ నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. చలాకి చంటి ముగ్గురు చెల్లెళ్లకు అన్నగా స్కిట్ చేశారు. చెల్లెళ్ళకి పెళ్లి అయ్యే వరకు ఇంకా పెళ్లి చేసుకోని అన్నగా చలాకి చంటి కనిపిస్తున్నారు.
కమెడియన్ నూకరాజు, దొరబాబు కలిసి చేసిన స్కిట్ నవ్వులు పూయిస్తోంది. సూర్యవంశం మూవీ పేరడీ చేశారు. ఇక రాకెట్ రాఘవ.. నటి ప్రగతిపై సెటైర్లు వేస్తూ చేసిన స్కిట్ హైలైట్ గా నిలిచింది. ప్రగతి గారు మీతో ఎప్పుడూ ఒక విషయం చెప్పాలనిపిస్తూ ఉంటుంది.. అంటూ జిమ్ వర్కౌట్లు మొదలు పెడతాడు.
రాఘవ జిమ్ వర్కౌట్లు చేస్తూనే ప్రగతితో మాట్లాడుతూ ఉంటాడు. దీంతో ప్రగతి నవ్వు ఆపుకోలేకపోతుంది. కాసేపటికి రాఘవ అలసిపోతాడు. పక్కనే ఉన్న వ్యక్తి.. అందుకే ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలని అంటాడు. తన గురించి చేసిన ఈ స్కిట్ ని ప్రగతి బాగా ఎంజాయ్ చేసినట్లు ఉంది. ఆ మధ్య ప్రగతి జిమ్ కసరత్తులతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై స్కిట్ చేసే సరికి ఆమె బాగా ఎంజాయ్ చేసింది. ఇక ఈ ప్రోమో వైరల్‌గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…