మంగళవారం, జూన్ 30, 2026
ఆరోగ్యం

Rice Drink : అన్నంతో చేసిన ఈ జావ‌ తాగితే వెంటనే స్లిమ్ అయిపోతారు.. ఎలా చేయాలి అంటే..?

Rice Drink : స్థూలకాయం అనేక వ్యాధులకు మూలం, ఎందుకంటే దీని కారణంగా శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా ఆరోగ్య స్పృహ ఉన్నవారు స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి ఆహార నియమాలు పాటిస్తారు. ఈ కారణంగా స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే…

Rice Drink : అన్నంతో చేసిన ఈ జావ‌ తాగితే వెంటనే స్లిమ్ అయిపోతారు.. ఎలా చేయాలి అంటే..?

Rice Drink : స్థూలకాయం అనేక వ్యాధులకు మూలం, ఎందుకంటే దీని కారణంగా శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా ఆరోగ్య స్పృహ ఉన్నవారు స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి ఆహార నియమాలు పాటిస్తారు. ఈ కారణంగా స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే ముందుగా ప్లేట్ నుండి అన్నం తీసేయండని కొందరు చెబుతుంటారు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు అదనపు కొవ్వు బరువు పెరిగేందుకు కారణం అవుతుండగా.. దానిని తగ్గించుకునేందుకు అనేక మార్గాల్లో ట్రై చేస్తున్నారు చాలామంది.

ఇలా డైటింగ్ చేసే క్రమంలో బరువు తగ్గే వరకైనా అన్నం తినడం తగ్గించాలని సూచిస్తుంటారు. కానీ అన్నం లేకుండా ఉండలేమని ఆందోళన చెందుతుంటారు చాలామంది. అలాంటి వారికి రైస్ డ్రింక్ ఓ వరం లాంటిదని చెప్పాలి. ఎందుకంటే ఈ డ్రింక్ తాగితే అన్నం తిన్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొవ్వు కరుగుతుంది. ఇది పూర్తిగా ఇంట్లోనే తయారు చేసుకోగల డ్రింక్. రైస్ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం. రైస్ డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు: బియ్యం రెండు టేబుల్ స్పూన్లు, నీరు తగినంత, జిలకర తగినంత, ఎండిన అల్లం పొడి తగినంత, మిరియాల పొడి తగినంత.

Rice Drink take this daily to get rid of over weight
Rice Drink

తయారు చేసే విధానం: జీరా, అల్లం పొడి, మిరియాల పొడులను సమాన భాగాల్లో తీసుకుని వాటిని మళ్లీ మిక్సీ పట్టి పొడిగా చేయాలి. ఈ పొడి నుంచి 1/4 టీస్పూన్ పొడిని తీసుకుని దాన్ని బియ్యానికి కలిపి ఈ మిశ్రమాన్ని మళ్లీ ఒక గ్లాస్ నీటికి కలపాలి. ఒక పాత్రలో ఈ మిక్స్ ను వేసి డికాషన్ లా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి దానికి కొద్దిగా ఉప్పును కలిపి తీసుకోవాలి. బరువు తగ్గేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించే వారు దీన్ని తాగితే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాదు కొద్ది డ్రింక్ తోనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇది అధిక బరువు తగ్గించుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి