గురువారం, జూన్ 11, 2026
స‌మాచారం

బ్యాంక్ ఖాతాదారులకు RBI హెచ్చరిక.. ఇలా చేస్తే క్షణాల్లో మీ ఖాతా ఖాళీ!

రోజురోజుకు సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్న క్రమంలో బ్యాంకు ఖాతాదారులు ఎన్నో జాగ్రత్తలు వహించాలని ఇప్పటికే RBI పలుమార్లు కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. బ్యాంకు ఖాతాదారులు ఏ మాత్రం జాగ్రత్తగా వ్యవహరించకపోతే క్షణాలలో తమ ఖాతాలో ఉన్న డబ్బులు…

బ్యాంక్ ఖాతాదారులకు RBI హెచ్చరిక.. ఇలా చేస్తే క్షణాల్లో మీ ఖాతా ఖాళీ!

రోజురోజుకు సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్న క్రమంలో బ్యాంకు ఖాతాదారులు ఎన్నో జాగ్రత్తలు వహించాలని ఇప్పటికే RBI పలుమార్లు కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. బ్యాంకు ఖాతాదారులు ఏ మాత్రం జాగ్రత్తగా వ్యవహరించకపోతే క్షణాలలో తమ ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ అవుతాయని RBI మరోసారి ఖాతాదారులను హెచ్చరించింది. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

ఈ క్రమంలోనే RBI ఈ వివరాలను అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా ఉండాలంటే ఏ కస్టమర్ కూడా తమ ఏటీఎం పిన్ నంబర్, CVV, OTP వంటి వివరాలను ఇతరులతో పంచుకోకూడదని తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు టోల్ ఫ్రీ నెంబర్ లకు కొద్దిపాటి తేడాతో ఉండే నెంబర్లను సృష్టించి ఖాతాదారులను మోసం చేస్తున్నారని ఇటువంటి టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మీకు ఏవైనా సందేహాలు ఉంటే బ్యాంకు అధికారిక వెబ్సైట్ ల నుంచి మాత్రమే టోల్ ఫ్రీ నెంబర్ లను తీసుకోవాలి కానీ గూగుల్ సెర్చ్ లో చేసే టోల్ ఫ్రీ నెంబర్ లను తీసుకోవటంవల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.ఈ విధంగా ఎవరైనా బ్యాంకు నుంచి ఫోన్ చేసి మీ వివరాలను అడిగితే వెంటనే మీరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని రిజర్వ్ బ్యాంక్ కస్టమర్ల కోసం ఈ విధమైనటువంటి సూచనలను చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి