Redmi Note 11 SE : త‌క్కువ ధ‌ర‌లో రెడ్‌మీ నుంచి వాట‌ర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్‌.. ఫీచర్లు కూడా అదుర్స్‌..!

August 27, 2022 8:45 PM

Redmi Note 11 SE : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ పేరిట విడుద‌లైన ఈ ఫోన్‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను సైతం అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. అందువ‌ల్ల ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది.

ఈ ఫోన్‌ను 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లోనే రిలీజ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఇందులో అందిస్తున్నారు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను, ఒక మెమొరీ కార్డును వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, ఇంకో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను అమ‌ర్చారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క వైపున ఉంది.

Redmi Note 11 SE launched with amazing features
Redmi Note 11 SE

ఈ ఫోన్‌కు ఐపీ53 వాట‌ర్ రెసిస్టెంట్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్లు కూడా ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేయ‌గా.. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌కు చార్జ‌ర్‌ను ఇవ్వ‌డం లేదు. కానీ రూ.499 విలువ చేసే చార్జ‌ర్‌ను రూ.199 కే కొనుగోలు చేసేలా ఆఫ‌ర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ కొన్న‌వారికి ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.

ఇక రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ బై ఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్‌, స్పేస్ బ్లాక్‌, థండ‌ర్ ప‌ర్పుల్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.13,499 కాగా ఆగస్టు 31వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తారు. లాంచింగ్ ఆఫ‌ర్ కింద ఈ ఫోన్ కొనుగోలుపై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల‌తో రూ.1000 వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment