Redmi 6A : రెడ్‌మీ 6ఎ ఫోన్ పేలి మ‌హిళ మృతి.. స్పందించిన షియోమీ..

September 12, 2022 7:36 PM

Redmi 6A : ప్ర‌స్తుత త‌రుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి మ‌న దిన‌చ‌ర్య‌లో భాగం అయిపోయాయి. మ‌నం ఏ ప‌ని చేస్తున్నా స‌రే ఫోన్ మ‌న వెంటే ఉంటోంది. అందులో అనేక ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకుంటున్నాం. అలాగే వినోదాన్ని కూడా పొందుతున్నాం. అయితే కొన్ని సార్లు ప‌లు కంపెనీల‌కు చెందిన ఫోన్లు పేలుతున్నాయి. దీంతో వినియోగ‌దారులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ త‌యారీ కంపెనీ షియోమీ విడుద‌ల చేసిన రెడ్ మీ 6ఎ ఫోన్ పేలింది. దీంతో ఓ మ‌హిళ మృతి చెందింది. వివ‌రాల్లోకి వెళితే..

ఢిల్లీలో నివాసం ఉండే మ‌న్‌జిత్ అనే వ్య‌క్తి బంధువు ఒక మ‌హిళ రాత్రి పూట రెడ్‌మీ 6ఎ ఫోన్‌ను త‌ల ద‌గ్గ‌ర పెట్టుకుని నిద్రించింది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆ ఫోన్ పేలింది. దీంతో ప‌క్క‌నే నిద్రిస్తున్న ఆ మ‌హిళ‌కు తీవ్ర గాయాలై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Redmi 6A smart phone exploded woman died Xiaomi responded
Redmi 6A

అయితే స‌ద‌రు మ‌న్‌జిత్ ఒక యూట్యూబ‌ర్ కావ‌డంతో ఈ విష‌యాన్ని అత‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించాడు. దీంతో స్పందించిన షియోమీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. త‌మ‌కు క‌స్ట‌మ‌ర్ సేఫ్టీ ముఖ్య‌మ‌ని పేర్కొంది. అంతేకాదు.. సంఘ‌ట‌న జ‌రిగిన చోటుకు తాము వెళ్తున్నామ‌ని.. అస‌లు ఏం జ‌రిగిందో తెలుసుకుని బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా స‌హాయం చేస్తామ‌ని తెలియ‌జేసింది. అయితే గ‌తంలోనూ ప‌లు సంఘ‌ట‌న‌ల్లో షియోమీ ఫోన్లు పేలాయి. కానీ మ‌రీ ఇంత తీవ్రంగా ఎవ‌రైనా మ‌ర‌ణించిన దాఖ‌లాలు లేవు. కాగా తాజాగా ఈ సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో మ‌రోమారు స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment