Rashmika Mandanna : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావడానికి కొంత టైం పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది. పుష్ప సినిమాతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పుష్పలో రష్మిక డీగ్లామర్ రోల్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా బాలీవుడ్ కన్ను రష్మికపై పడింది.
రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో రష్మిక నటించిన చిత్రం గుడ్ బై అక్టోబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక బిజీ బిజీగా గడుపుతుంది. సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, మీమ్స్ చూసి రష్మిక ఎంత బాధ పడుతుందో చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. నేను సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఏమీ తెలిసేది కాదు. నాకు గైడెన్స్ ఇవ్వడానికి ఎవ్వరూ లేరు.
తర్వాత మెల్లగా ఇండస్ట్రీని అర్థం చేసుకున్నాను. సినిమా ఫ్లాప్ అయినా బాధ పడలేదు కానీ నాపై కొందరు చేసిన ట్రోల్స్ వల్ల ఇప్పటికీ బాధపడుతున్నాను. నాది చాలా సున్నిత మనస్తత్వం.. శత్రువులు ఉండకూడదు అనుకుంటాను. ప్రజెంట్ నా ఫోకస్ సినిమాలపైనే ఉంది, అందుకే నన్ను ట్రోల్ చేసే వారిని పట్టించుకోవట్లేదు. కానీ కెరీర్ కొత్తలో నన్ను ట్రోల్ చేసిన మీమ్స్ రాత్రి కలలో వచ్చేవి.. నేను ఎవరినో వేడుకుంటున్నట్లు అందరూ నన్ను సమాజం నుంచి వెలివేసినట్లు భయంకరమైన కలలు వచ్చేవి. ఆ టైంలో ఉలిక్కిపడి నిద్రలేచి ఏడ్చేసే దాన్ని.. రాత్రంతా అలాగే ఏడుస్తూ కూర్చున్నాను.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను అంటూ రష్మిక తన చేదు అనుభూతులను గుర్తుచేసుకుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…