Venkatesh : శోభన్ బాబు, కృష్ణంరాజులతో వెంకటేష్ మల్టీ స్టారర్ చిత్రాలు మధ్యలోనే ఎందుకు ఆగిపోయాయి..?

Venkatesh : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు విక్ట‌రీ వెంక‌టేష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న కెరీర్ తొలినాళ్లలో చేసిన అన్ని సినిమాలు హిట్ అందుకున్నాయి. అందుకే ఆయనను అభిమానులు ముద్దుగా విక్టరీ వెంకటేష్ అని పిలుచుకుంటారు. లెజెండరీ నిర్మాత రామానాయుడు దగ్గుబాటి వారి వారసుడిగా వెంకటేష్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన సహజమైన నటనతో హీరోగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. వెంకటేష్ కెరీర్ లో ఫ్లాప్ సినిమాల కంటే బ్లాక్ బస్టర్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

వెంకటేష్ సినిమాలను చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడేవారు. అంతేకాకుండా కేవలం ఒకే రకమైన సినిమాలకు పరిమితం అవ్వకుండా విభిన్నమైన పాత్రలు కలిగిన చిత్రాలను ఎంచుకుంటూ వెంకటేష్ ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. మొదటి నుంచి వెంకటేష్ స్టార్ హీరో అయినప్పటికీ మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఆయన కెరీర్ లో మల్టీస్టారర్ చిత్రాలు చాలానే ఉన్నాయి.

Venkatesh

హీరో సుమన్ తో కొండపల్లి రాజా, హీరో అబ్బాస్ తో రాజా, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, నాగచైతన్యతో వెంకీ మామ వంటి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు వెంకటేష్. ఇక ఇవే కాకుండా వెంకటేష్ కెరీర్ బిగినింగ్ లో కూడా మల్టీస్టారర్ చిత్రాలను చేయడానికి సిద్ధమయ్యారు.

వెంకటేష్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే రెబల్ స్టార్ కృష్ణంరాజుతో కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా నటభూషణ శోభన్ బాబుతో కూడా ఓ మల్టీస్టారర్ ను మొదలుపెట్టారు. శోభన్ బాబు, వెంకటేష్ కలిసి నటించవలసిన చిత్రానికి  బి గోపాల్ దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి  సంగీత దర్శకుడిగా బప్పి లహరిని నియమించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది.

అదేవిధంగా కృష్ణంరాజు, వెంకటేష్ ల కాంబినేషన్ లోనూ మల్టీ స్టారర్ గా ప్రారంభించిన చిత్రానికి సెల్వమణి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ సినిమాలో విజయశాంతిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ అదే సమయంలో మళ‌యాళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమా కథను బి గోపాల్ వెంకటేష్ తో చర్చలు జరపడంతో సెల్వమణి సినిమా పక్కన పెట్టేసి వెంకటేష్ ఆ సినిమాని కమిట్ అయి నటించడం జరిగింది. అలా అప్పట్లో వెంకటేష్ చేయాల్సిన రెండు మల్టీ స్టారర్ చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి.

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి  కలిసి నటిస్తోన్న లేటేస్ట్ వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ ని  ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తోంది. యాక్షన్, క్రైమ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సిరీస్‏లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు. త్వరలోనే రానా నాయుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల విడుదలైన రానా నాయుడు టీజర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM