Rashmika Mandanna : వాళ్లు చేసిన పనికి.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. కన్నీళ్లు పెట్టిస్తున్న రష్మిక మాటలు..!

October 4, 2022 4:50 PM

Rashmika Mandanna : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావ‌డానికి కొంత టైం ప‌డుతుంది. అదే కొంద‌రు న‌టీమ‌ణులు మాత్రం ఒక‌టీ రెండు సినిమాల‌తోనే స్టార్ స్టేట‌స్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న‌. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది. పుష్ప సినిమాతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పుష్పలో రష్మిక డీగ్లామర్ రోల్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా బాలీవుడ్ కన్ను రష్మికపై పడింది.

ర‌ష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో రష్మిక నటించిన చిత్రం గుడ్ బై అక్టోబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక బిజీ బిజీగా గడుపుతుంది. సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, మీమ్స్ చూసి రష్మిక ఎంత బాధ పడుతుందో చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. నేను సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఏమీ తెలిసేది కాదు. నాకు గైడెన్స్ ఇవ్వడానికి ఎవ్వరూ లేరు.

Rashmika Mandanna said she faced many troubles in her career
Rashmika Mandanna

తర్వాత మెల్లగా ఇండస్ట్రీని అర్థం చేసుకున్నాను. సినిమా ఫ్లాప్ అయినా బాధ పడలేదు కానీ నాపై కొందరు చేసిన ట్రోల్స్ వ‌ల్ల ఇప్పటికీ బాధపడుతున్నాను. నాది చాలా సున్నిత మనస్తత్వం.. శత్రువులు ఉండకూడదు అనుకుంటాను. ప్రజెంట్ నా ఫోకస్ సినిమాలపైనే ఉంది, అందుకే నన్ను ట్రోల్ చేసే వారిని పట్టించుకోవట్లేదు. కానీ కెరీర్ కొత్తలో నన్ను ట్రోల్ చేసిన మీమ్స్ రాత్రి కలలో వచ్చేవి.. నేను ఎవరినో వేడుకుంటున్నట్లు అందరూ నన్ను సమాజం నుంచి వెలివేసినట్లు భయంకరమైన కలలు వచ్చేవి. ఆ టైంలో ఉలిక్కిపడి నిద్రలేచి ఏడ్చేసే దాన్ని.. రాత్రంతా అలాగే ఏడుస్తూ కూర్చున్నాను.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను అంటూ రష్మిక తన చేదు అనుభూతులను గుర్తుచేసుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now