విజ‌య్ కోసం ర‌ష్మిక అంత దూరం వెళుతుందా.. ఇద్ద‌రి మ‌ధ్య ఏమైనా న‌డుస్తుందా..?

November 24, 2021 9:56 PM

టాలీవుడ్‌లో ఆన్‌స్క్రీన్‌పై అద్భుతంగా న‌టించి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్న క్రేజీ జంట విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందన్న. విజయ్, రష్మికకు సంబంధించిన మ్యాటర్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ.. పూరీ డైరెక్షన్‌లో రానున్న ‘లైగర్‌’లో నటిస్తున్నాడు. అలాగే రష్మిక.. ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌, బాలీవుడ్‌ లో బిజీగా ఉంది.

rashmika mandanna may be going to usa for vijay devarakonda

ర‌ష్మిక తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో పిక్స్ షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి చూద్దాం ? అని అభిమానులను సస్పెన్స్ లో పెట్టేసింది. దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు పేర్కొంటూ ఆమె విమాన ప్రయాణం, పాస్‌పోర్ట్ చిత్రాలను పంచుకుంది. ర‌ష్మిక షేర్ చేసిన పిక్స్ చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఒక పిక్ కి “ఈసారి మీకు చాలా దూరంగా వెళ్తున్నా.. నేను త్వరలో తిరిగి వస్తాను” అని రాసింది.

ర‌ష్మిక పోస్ట్‌తో అంద‌రిలోనూ అనేక అనుమానాలు త‌లెత్తాయి. కొంద‌రు ర‌ష్మిక యునైటెడ్ స్టేట్స్ వెళ్లిందని, అక్కడ పూరీ జగన్నాధ్ “లైగర్” సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా యూఎస్‌ షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్న తన సహనటుడు, బెస్ట్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండను కలవడానికి వెళ్లి ఉంటుంది.. అంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు రష్మిక ‘లైగర్’ గెస్ట్ రోల్ లో కనిపించబోతోందా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment