Rashmi Gautam : బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు, మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు. ఈమె ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఎన్నో కార్యక్రమాలలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు వస్తే సినిమాలలో కూడా నటిస్తూ అలరిస్తోంది.
యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అదే విధంగా సామాజిక అంశాలపై కూడా ఈమె స్పందిస్తుంటుంది. ఈ క్రమంలోనే మూగజీవాలపై ఈమెకు ఎంతో అమితమైన ప్రేమ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నో మూగజీవాలకు ఆహారాన్ని అందజేయడం మనకు తెలిసిందే.
ఇకపోతే ఎవరైనా మూగజీవాలను హింసించినట్టు ఈమె దృష్టికి వచ్చినా ఈమె ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్ దేవాస్‌లోని వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకునే క్రమంలో ఓ కుక్కకు తాడు బిగించి అది చనిపోయేవరకు విచక్షణారహితంగా కొట్టారు. ఈ వీడియోను ఓ వ్యక్తి రష్మికి ట్యాగ్ చేస్తూ షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన రష్మి ఎమోషనల్ అవుతూ.. మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం ఇది. ఈ భూమి మీద మీకు ఉండే అర్హత లేదంటూ.. ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…