Gangavva : మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చిరంజీవి మలయాళంలో తెరకెక్కి అద్భుతమైన విజయాన్ని అందుకున్న లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి భిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.
ఈ సినిమా గురించి తాజా సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి తల్లి పాత్రలో నటించే అవకాశం బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన గంగవ్వకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది.
మై విలేజ్ షో.. అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయమైన గంగవ్వ ఎన్నో వీడియోల ద్వారా ఎంతోమంది అభిమానులను దక్కించుకొని సెలబ్రిటీగా మారిపోయింది. ఈ క్రమంలోనే గంగవ్వకు ఉన్న క్రేజ్ చూసి బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా నిర్వాహకులు ఆమెను ఎంపిక చేశారు. బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకున్న గంగవ్వ ఏకంగా వెండితెరపై నటించే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…