Rashmi Gautam : మీకు భూమి మీద ఉండే అర్హత లేదు.. ఎమోషనల్ అయిన రష్మి.. వీడియో..

October 4, 2021 3:04 PM

Rashmi Gautam : బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు, మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు. ఈమె ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఎన్నో కార్యక్రమాలలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు వస్తే సినిమాలలో కూడా నటిస్తూ అలరిస్తోంది.

Rashmi Gautam : మీకు భూమి మీద ఉండే అర్హత లేదు.. ఎమోషనల్ అయిన రష్మి.. వీడియో..

యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అదే విధంగా సామాజిక అంశాలపై కూడా ఈమె స్పందిస్తుంటుంది. ఈ క్రమంలోనే మూగజీవాలపై ఈమెకు ఎంతో అమితమైన ప్రేమ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నో మూగజీవాలకు ఆహారాన్ని అందజేయడం మనకు తెలిసిందే.

ఇకపోతే ఎవరైనా మూగజీవాలను హింసించినట్టు ఈమె దృష్టికి వచ్చినా ఈమె ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్‌ దేవాస్‌లోని వీధి కుక్కలను మున్సిపల్‌ సిబ్బంది పట్టుకునే క్రమంలో ఓ కుక్కకు తాడు బిగించి అది చనిపోయేవరకు విచక్షణారహితంగా కొట్టారు. ఈ వీడియోను ఓ వ్యక్తి రష్మికి ట్యాగ్ చేస్తూ షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన రష్మి ఎమోషనల్ అవుతూ.. మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం ఇది. ఈ భూమి మీద మీకు ఉండే అర్హత లేదంటూ.. ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now