Ram Charan Tej : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన ఆచార్య, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు విడుదల కాకుండానే రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో, కియారా అద్వానీతో కలిసి ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు పూణేలో జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా తర్వాత మరో సినిమా ఉండబోతుందని దసరా కానుకగా ప్రశాంత్ నీల్ ఓ సినిమాను ప్రకటించారు. అయితే ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. చరణ్ మాత్రం తాజాగా మరో ఇద్దరు దర్శకులను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరు దర్శకులు చెప్పిన స్టోరీ లైన్ విన్న రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్క్రిప్ట్ తయారు చేయమని చెప్పినట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ ఈ సినిమాలను కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ స్పీడ్ మీద రామ్ చరణ్ ఉన్నారని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…