Reethu Varma : పెళ్లి చూపులు చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ రీతూ వర్మ. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో వరుస ఆఫర్స్ అందుకుంటున్న రీతూ వర్మ ప్రస్తుతం నాగశౌర్యతో కలిసి ‘వరుడు కావలెను’లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు.
‘నిన్నిలా నిన్నిలా అనే సినిమా విడుదలైన కొద్ది రోజులకు ‘టక్ జగదీష్’, ఇప్పుడు ‘వరుడు కావలెను ఇలా వరుస సినిమాలతో సందడి చేస్తోంది రీతూ. మొదటి రెండు ఓటీటీలలో విడుదల కాగా, వరుడు కావలెను థియేటర్లలో విడుదలవుతుండడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఇదొక ప్రేమకథ. ఇటు కుటుంబ ప్రేక్షకులకూ, అటు యువతరానికీ నచ్చేలా ఉంటుంది. నాగశౌర్య క్రమశిక్షణ కలిగిన నటుడు. మా జోడీ బాగుందనే కితాబు చిత్రీకరణ దశలోనే వచ్చింది. అక్కడే సగం విజయం సాధించాం అనిపించింది.. అని రీతూ పేర్కొంది.
ప్రస్తుతం శర్వానంద్‌తో ‘ఒకే ఒక జీవితం’ సినిమా చేస్తున్నాను. తమిళ్‌లో ఓ సినిమా, ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను అన్నారు రీతూ వర్మ. పెళ్లెప్పుడు అని అడగ్గా.. ‘‘ఇంకా రెండు మూడేళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి నిర్ణయాన్ని మా ఇంట్లో నాకే వదిలేశారు. అయినా అప్పుడప్పుడూ పెళ్లి మాట ఎత్తకుండా ఉండరు.. అన్నారు రీతూ వర్మ.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…