గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Reethu Varma : పెళ్లి నిర్ణ‌యం నాదే.. అప్పుడే పెళ్లి చేసుకుంటాన‌న్న రీతూ..!

Reethu Varma : పెళ్లి చూపులు చిత్రంతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ రీతూ వ‌ర్మ‌. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటున్న రీతూ వ‌ర్మ ప్ర‌స్తుతం నాగశౌర్యతో కలిసి ‘వరుడు కావలెను’లో నటించింది.…

Reethu Varma : పెళ్లి నిర్ణ‌యం నాదే.. అప్పుడే పెళ్లి చేసుకుంటాన‌న్న రీతూ..!

Reethu Varma : పెళ్లి చూపులు చిత్రంతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ రీతూ వ‌ర్మ‌. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటున్న రీతూ వ‌ర్మ ప్ర‌స్తుతం నాగశౌర్యతో కలిసి ‘వరుడు కావలెను’లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.

Reethu Varma told about her marriage

‘నిన్నిలా నిన్నిలా అనే సినిమా విడుద‌లైన కొద్ది రోజుల‌కు ‘టక్‌ జగదీష్‌’, ఇప్పుడు ‘వరుడు కావలెను ఇలా వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తోంది రీతూ. మొద‌టి రెండు ఓటీటీలలో విడుద‌ల కాగా, వరుడు కావలెను థియేటర్లలో విడుదలవుతుండడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఇదొక ప్రేమకథ. ఇటు కుటుంబ ప్రేక్షకులకూ, అటు యువతరానికీ నచ్చేలా ఉంటుంది. నాగశౌర్య క్రమశిక్షణ కలిగిన నటుడు. మా జోడీ బాగుందనే కితాబు చిత్రీకరణ దశలోనే వచ్చింది. అక్కడే సగం విజయం సాధించాం అనిపించింది.. అని రీతూ పేర్కొంది.

ప్రస్తుతం శర్వానంద్‌తో ‘ఒకే ఒక జీవితం’ సినిమా చేస్తున్నాను. తమిళ్‌లో ఓ సినిమా, ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను అన్నారు రీతూ వ‌ర్మ. పెళ్లెప్పుడు అని అడగ్గా.. ‘‘ఇంకా రెండు మూడేళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి నిర్ణయాన్ని మా ఇంట్లో నాకే వదిలేశారు. అయినా అప్పుడప్పుడూ పెళ్లి మాట ఎత్తకుండా ఉండరు.. అన్నారు రీతూ వర్మ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి