Naga Saurya : స్టార్ హీరో కావాలంటే ఆ విధంగా జరగాలి: నాగ శౌర్య

October 29, 2021 2:03 PM

Naga Saurya : నాగ శౌర్య, రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి నాగశౌర్య పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న అల్లు అర్జున్ నాగశౌర్య గురించి మాట్లాడిన మాటలు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని ఈ సందర్భంగా నాగశౌర్య తెలియజేశారు.

Naga Saurya said to become star hero it has to be happen like that

లక్ష్మీ సౌజన్య అక్క కథ చెప్పినప్పుడు చాలా బాగుంది అనిపించింది. సినిమా చూశాక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని నమ్ముతున్నా.. అంటూ నాగశౌర్య తెలియజేశారు. ఇంతకు ముందు నందినిరెడ్డి దర్శకత్వంలో, ఇప్పుడు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సినిమాలు చేశాను. మహిళా దర్శకులకు ఓపిక ఎక్కువ అనే విషయాన్ని గ్రహించానని ఈ సందర్భంగా హీరో నాగశౌర్య వెల్లడించారు.

ఈ సినిమా విషయానికి వస్తే 30 సంవత్సరాలు వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ ఇంట్లో ఒత్తిడి తెస్తారు. అయితే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని గ్రహించాలని చెప్పే మాట ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన తను స్టార్ హీరోగా ఎదిగాలి అంటే తనకు ఐదు సినిమాలు హిట్ కావాలని వెల్లడించారు. తనకు చలో సినిమా ఒక హిట్ కాగా వరుడు కావలెను రెండవ హిట్ అని ఈ సందర్భంగా నాగశౌర్య తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now